Telugu Global
CRIME

నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హ‌త్య‌

నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థిని మ‌రికొంద‌రు విద్యార్థులు తుపాకీ కాల్చి, గొడ్డ‌లితో న‌రికి దారుణంగా హ‌త్య చేశారు. నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే సహకార బ్యాంకు ఉద్యోగి రామరాజు శ్యాంసుందర్‌రావు, రూప దంపతుల రెండో కుమారుడైన సందేశ్ (19) నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (మెరైన్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం హాస్టల్‌లో ఉన్న సందేశ్… ద్వితీయ సంవత్సరం ఓ అపార్ట్‌మెంట్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. పర్యాటక నిర్వహణ […]

నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హ‌త్య‌
X
నోయిడాలో దారుణం చోటు చేసుకుంది. తెలుగు విద్యార్థిని మ‌రికొంద‌రు విద్యార్థులు తుపాకీ కాల్చి, గొడ్డ‌లితో న‌రికి దారుణంగా హ‌త్య చేశారు. నల్లగొండలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉండే సహకార బ్యాంకు ఉద్యోగి రామరాజు శ్యాంసుందర్‌రావు, రూప దంపతుల రెండో కుమారుడైన సందేశ్ (19) నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (మెరైన్ సైన్స్) రెండో సంవత్సరం చదువుతున్నాడు. మొదటి సంవత్సరం హాస్టల్‌లో ఉన్న సందేశ్… ద్వితీయ సంవత్సరం ఓ అపార్ట్‌మెంట్‌లో గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు.
పర్యాటక నిర్వహణ కోర్సు చదువుతున్న అమన్, అతని స్నేహితుడు మౌంటీలు శనివారం సాయంత్రం సందేష్ ఉంటున్న 1804 నంబర్ గదికి వెళ్లి కాలింగ్‌బెల్ కొట్టారు. సందేశ్ త‌లుపు తీయ‌గానే అమ‌న్ ఫైర్ ఓపెన్ చేశాడు. ప‌క్క‌నే ఉన్న మౌంటీ గొడ్డ‌లితో నరికాడు. సందేశ్ త‌న‌ను చంప‌వ‌ద్ద‌ని బ్ర‌తిమిలాడినా వినిపించుకోలేదు. వారి ప్ర‌య‌త్నాన్ని ఆపాల‌ని య‌త్నించిన సందేశ్ రూమ్‌మేట్ న‌దీమ్‌నూ చంపుతామ‌ని బెదిరించడంతో అత‌ను మ‌రో గ‌దిలోకి వెళ్లి త‌లుపేసుకున్నాడు. ఘ‌ట‌న‌పై స్టేషన్ హౌస్ అధికారి జహీర్‌ఖాన్ మాట్లాడుతూ పరారీలో ఉన్న అమన్, మౌంటీలు హర్యానాలోని పానిపట్‌కు చెందినవారని చెప్పారు. సందేశ్‌కు అమన్‌కు మధ్య రెండు నెలల కిందట గొడవ జరిగిందని, ఆ తర్వాత నుంచి వారిద్దరూ స్నేహితులుగానే ఉంటున్నారని… ఇంత‌లో సందేశ్‌ను అతికిరాత‌కంగా ఎందుకు చంపార‌న్న‌ది మిస్ట‌రీగా మారింది.
First Published:  18 Oct 2015 3:01 PM GMT
Next Story