Telugu Global
Cinema & Entertainment

శవయాత్రతో మెగాఫ్యాన్స్ చీప్‌ట్రిక్స్

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎదురులేని ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ అని అందరికీ తెలుసు. అది మెగాస్టార్ చిరంజీవి, తన స్వీయ ప్రతిభతో సాధించుకున్న ఘనత. ఎంతటి గొప్పవారికైనా కొన్ని కొన్ని విమర్శలు తప్పవు. మెగా ఫ్యామిలీ ఎంచుకున్న రంగాలు అట్లాంటివి.. సినిమాలు.. పాలిటిక్స్. ఇక ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ కి మెగాఫ్యాన్స్ మధ్యలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో మాటల యుధ్ధ్దం హద్దులు దాటి మితిమీరిపోయింది. RGV ఒక్కడు. వేలాదిమంది మెగాఫ్యాన్స్. అయినా మన ఎసెంట్రిక్ […]

శవయాత్రతో మెగాఫ్యాన్స్ చీప్‌ట్రిక్స్
X

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ ఎదురులేని ఇన్‌ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ అని అందరికీ తెలుసు. అది మెగాస్టార్ చిరంజీవి, తన స్వీయ ప్రతిభతో సాధించుకున్న ఘనత. ఎంతటి గొప్పవారికైనా కొన్ని కొన్ని విమర్శలు తప్పవు. మెగా ఫ్యామిలీ ఎంచుకున్న రంగాలు అట్లాంటివి.. సినిమాలు.. పాలిటిక్స్. ఇక ఇటీవల కాలంలో రామ్ గోపాల్ వర్మ కి మెగాఫ్యాన్స్ మధ్యలో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో మాటల యుధ్ధ్దం హద్దులు దాటి మితిమీరిపోయింది.
RGV ఒక్కడు. వేలాదిమంది మెగాఫ్యాన్స్. అయినా మన ఎసెంట్రిక్ డైరెక్టర్ ఏ మాత్రం తగ్గట్లేదు. కొందరు మెగాఫ్యాన్స్ అత్యుత్సాహంతో ‘RGV RIP’ అంటూ తయారు చేసిన పోస్టర్‌ని షేర్ చేసి గేలి చేసారు … కాని ఆదివారం మెగాఫ్యాన్స్ నిజంగానే RGV కి శవయాత్ర అంటూ హంగామా చేసి ఒక పెద్ద ఊరేగింపు కూడా చేసి .. ఈ గొడవను నెక్స్ట్‌ లెవల్‌కి తీసుకెళ్ళిపోయారు. కాని దీనికి సంబంధించిన చిత్రాలు చూసిన వారు మాత్రం.. ఒక్కడికి సమాధానం చెప్పుకోలేక .. శవయాత్ర వంటి చీప్ ట్రిక్స్ చిరంజీవి ఇమేజ్‌కి ఏమీ మంచిది కాదని.. మెగాఫ్యాన్స్ ఆలోచించాలని కోరుకుంటునారు. మరి మీరేమంటారు?

Next Story