Telugu Global
Cinema & Entertainment

పవన్ కల్యాణ్ యూ-ట్యూబ్ ఛానెల్

 హీరోలు చాలామందికి ఇప్పటికే యూట్యూబ్ లో ఖాతాలున్నాయి. పవర్ స్టార్ మాత్రం వాటికి దూరంగా ఉంటూవచ్చాడు.కానీ తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కూడా యూట్యూబ్ లో అధికారికంగా ఓ ఛానెల్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించి తన టీమ్ కు ఆదేశాలిచ్చాడు పవన్. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టమని ఆదేశాలిస్తూనే, అందులో ఎలాంటి కంటెంట్ పెట్టాలనే అంశంపై కూడా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ తో యూట్యూబ్ […]

పవన్ కల్యాణ్ యూ-ట్యూబ్ ఛానెల్
X
హీరోలు చాలామందికి ఇప్పటికే యూట్యూబ్ లో ఖాతాలున్నాయి. పవర్ స్టార్ మాత్రం వాటికి దూరంగా ఉంటూవచ్చాడు.కానీ తాజా పరిణామాల నేపథ్యంలో పవన్ కూడా యూట్యూబ్ లో అధికారికంగా ఓ ఛానెల్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించి తన టీమ్ కు ఆదేశాలిచ్చాడు పవన్. ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టమని ఆదేశాలిస్తూనే, అందులో ఎలాంటి కంటెంట్ పెట్టాలనే అంశంపై కూడా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా సర్దార్ గబ్బర్ సింగ్ ప్రమోషన్ తో యూట్యూబ్ ఛానెల్ లాంచ్ చేయాలని భావిస్తున్నాడు పవన్. అలా చేస్తే.. ఓ ఎకౌంట్ ఓపెన్ చేయడంతో పాటు సినిమాకు కూడా బాగా ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నాడు. హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ నడుస్తోంది. దసరా తర్వాత విదేశాల్లో ఓ షెడ్యూల్ స్టార్టవుతుంది. హీరోయిన్ కాజల్ తో కలిసి విదేశాల్లో రెండు పాటల్ని పిక్చరైజ్ చేస్తారు.
Next Story