Telugu Global
Cinema & Entertainment

బ్రూస్ లీపై వర్మ రివ్య్వూ

కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీని ట్విట్టర్ ద్వారా వెంటాడుతున్న రామ్‌గోపాల్ వర్మ… చరణ్ ”బ్రూస్‌లీ” విడుదలైన రోజే మరోసారి ట్విట్టర్ దండయాత్ర చేశారు. మెగా ఫ్యాన్స్‌కు మండిపోయేలా కామెంట్స్ పెట్టారు. అసలు ఈ సినిమాకు ”బ్రూస్ లీ” పేరు ఎందుకు పెట్టారో బ్రూస్ లీ అభిమానిగా తనకు అర్థం కాలేదన్నారు. ఈ చిత్రానికి ”బ్రూస్ లీ” పేరు పెట్టకపోయి ఉంటే చరణ్ నటన అద్భుతంగా ఉండేదని ట్వీట్ చేశారు. బ్రూస్ లీ లేని చిత్రానికి ”బ్రూస్ లీ” పేరు […]

బ్రూస్ లీపై వర్మ రివ్య్వూ
X

కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీని ట్విట్టర్ ద్వారా వెంటాడుతున్న రామ్‌గోపాల్ వర్మ… చరణ్ ”బ్రూస్‌లీ” విడుదలైన రోజే మరోసారి ట్విట్టర్ దండయాత్ర చేశారు. మెగా ఫ్యాన్స్‌కు మండిపోయేలా కామెంట్స్ పెట్టారు.

అసలు ఈ సినిమాకు ”బ్రూస్ లీ” పేరు ఎందుకు పెట్టారో బ్రూస్ లీ అభిమానిగా తనకు అర్థం కాలేదన్నారు. ఈ చిత్రానికి ”బ్రూస్ లీ” పేరు పెట్టకపోయి ఉంటే చరణ్ నటన అద్భుతంగా ఉండేదని ట్వీట్ చేశారు. బ్రూస్ లీ లేని చిత్రానికి ”బ్రూస్ లీ” పేరు పెట్టడం ఆశ్చర్యమేసిందన్నారు. బ్రూస్ లీ టైటిల్‌తోనే అసలు సమస్య వచ్చిందన్నారు. ”బ్రూస్ లీ” సినిమా చూసి వచ్చిన తర్వాత మరోసారి అసలు బ్రూస్ లీ నటించిన ”ఎంటర్ ద డ్రాగన్” సినిమా చూశానంటూ ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశారు.

పనిలో పనిగా మెగాస్టార్ చిరు ప్రస్తావన కూడా తెచ్చారు. బాస్ తన 150వ సినిమా కోసం ”బ్రూస్ లీ”ని ఎంచుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చిరంజీవి 151 సినిమాలో ”బ్రూస్ లీ”లో కంటే మంచిగా కనిపించాలని ఆశిస్తున్నానని వర్మ ట్విట్ చేశారు. ‘బాస్ 151వ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? జస్ట్ అడుగుతున్నా..’ అంటూ గెలికి వదిలేశారు వివాదాల వర్మ. .

Next Story