Telugu Global
Others

రాజ్‌కోట్ వ‌న్డేకు ప‌టేళ్ల సెగ‌!

భార‌త్‌- ద‌క్షిణాఫ్రికాల మ‌ధ్య గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేకు ప‌టేళ్ల నిర‌స‌న సెగ తాక‌నుంది. త‌మ‌ను ఓబీసీలో చేర్చాలంటూ.. ప‌టేళ్ల వ‌ర్గం కొంత‌కాలంగా చేస్తోన్న ఆందోళ‌న ప్రపంచానికి తెలియ‌జేయాలనే వ్యూహంలో భాగంగానే వారు మూడో వ‌న్డేను ఎన్నుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌టేళ్ల వ‌ర్గం వంద‌లాది టికెట్లు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే.. ఫ్లాష్ మాబ్ త‌ర‌హా నినాదాలు చేసి కెమెరాల దృష్టిని త‌మ వైపు తిప్పుకునేలా.. ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. వివిధ […]

రాజ్‌కోట్ వ‌న్డేకు ప‌టేళ్ల సెగ‌!
X
భార‌త్‌- ద‌క్షిణాఫ్రికాల మ‌ధ్య గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో ఆదివారం జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డేకు ప‌టేళ్ల నిర‌స‌న సెగ తాక‌నుంది. త‌మ‌ను ఓబీసీలో చేర్చాలంటూ.. ప‌టేళ్ల వ‌ర్గం కొంత‌కాలంగా చేస్తోన్న ఆందోళ‌న ప్రపంచానికి తెలియ‌జేయాలనే వ్యూహంలో భాగంగానే వారు మూడో వ‌న్డేను ఎన్నుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ప‌టేళ్ల వ‌ర్గం వంద‌లాది టికెట్లు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. మ్యాచ్ జ‌రుగుతుండ‌గానే.. ఫ్లాష్ మాబ్ త‌ర‌హా నినాదాలు చేసి కెమెరాల దృష్టిని త‌మ వైపు తిప్పుకునేలా.. ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది. వివిధ గ్యాల‌రీలో టికెట్లు కొనుగోలు చేసిన వీరంతా మ్యాచ్ మ‌ధ్య‌లో.. ఒకచోట‌కు చేర‌తారు. ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన డ్రెస్‌కోడ్ కూడా సిద్ధం చేసుకున్నారు. దీనిపై నిఘావ‌ర్గాలు స‌మాచారం అంద‌కున్న వెంట‌నే.. అనుమానితుల‌కు ఎలాంటి టికెట్ విక్ర‌యాలు జ‌ర‌ప‌లేదు. కానీ, అప్ప‌టికే చాలామంది ఆన్‌లైన్ ద్వారా టికెట్లు కొనుగోలు చేసేశారు. నిర‌స‌న‌కారుల‌ను ఎట్టిప‌రిస్థితుల్లోనూ స్టేడియంలోకి అనుమ‌తించ‌కూడ‌ద‌ని పోలీసులు నిర్ణ‌యించారు. ఇందుకోసం ప‌క్కాగా త‌నిఖీలు చేసేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
హ‌ర్దిక్ ప‌టేల్ ప్ర‌క‌ట‌న ప‌క్క‌దారి ప‌ట్టించేందుకేనా?
త‌మ వ‌ర్గం వారికి టికెట్లు విక్రయించ‌లేద‌ని తాజాగా పాటిదార్‌ అనామ‌త్ ఆందోళ‌న స‌మితి (పీఏఏసీ) హ‌ర్దిక్ ప‌టేల్ ఆరోపించాడు. భార‌త్‌- ద‌క్షిణాఫ్రికా జ‌ట్ల‌ను మార్గమ‌ధ్యలోనే అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించాడు. స్థానిక సౌరాష్ట్ర క్రికెట్ సంఘాన్ని ముట్ట‌డిస్తామ‌ని వెల్ల‌డించాడు. హ‌ర్దిక్ చేసిన‌ ప్ర‌క‌ట‌న వెన‌క వేరే వ్యూహం ఉండి ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు జ‌ట్లు హోటెల్ నుంచి మైదానం వ‌ర‌కు సుర‌క్షితంగా చేరేందుకు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త, ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయి. ఈ దారిలో నిర‌స‌న తెలిపే అవ‌కాశాలు చాలా స్వ‌ల్పం. ఇక‌పోతే సౌరాష్ట్ర క్రికెట్ సంఘాన్ని ముట్ట‌డించినా.. దాన్ని సులువుగానే అదుపు చేయ‌వ‌చ్చు. ఎటొచ్చీ.. మైదానంలో ఉన్న ప్రేక్ష‌కుల రూపంలో ఉన్న ప‌టేల్ వ‌ర్గీయుల‌తోనే స‌మ‌స్య‌. అందులో ప‌టేళ్ల వ‌ర్గీయులు ఎవ‌రిన్న‌ది క‌నుక్కోవ‌డం క‌త్తి మీద సామే! అందుకే మైదానంలోనూ భారీగా పోలీసుల‌ను మ‌ఫ్టీలో మోహ‌రించే అవ‌కాశాలు ఉన్నాయి. ఎలాగైనా మ్యాచ్ మ‌ధ్య‌లో ఆటంకం క‌లిగించాల‌ని ప‌టేళ్ల వ‌ర్గీయులు, అడ్డుకోవాల‌ని పోలీసుల ప్ర‌య‌త్నాల నేప‌థ్యంలో రేపు మ్య‌చ్‌లో ఏం జ‌రుగుతుంద‌ని స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.
First Published:  16 Oct 2015 10:01 PM GMT
Next Story