Telugu Global
Cinema & Entertainment

అనుష్క సినిమాకు 15వందల తెరలు

అవును.. ఓ బడా హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా అనుష్క కొత్త సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల 27న ఆమె నటిస్తున్న సైజ్ జీరో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1500 తెరలను ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. మరో 3వందల స్క్రీన్స్ ను అడ్వాన్స్ బుకింగ్ ఆర్డర్ లో తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పీీవీపీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్దగా ఖర్చుపెట్టనప్పటికీ.. ప్రమోషన్ కోసం […]

అనుష్క సినిమాకు 15వందల తెరలు
X
అవును.. ఓ బడా హీరోకు ఏమాత్రం తీసిపోని విధంగా అనుష్క కొత్త సినిమా విడుదలను ప్లాన్ చేస్తున్నారు. వచ్చేనెల 27న ఆమె నటిస్తున్న సైజ్ జీరో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 1500 తెరలను ఇప్పటికే రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. మరో 3వందల స్క్రీన్స్ ను అడ్వాన్స్ బుకింగ్ ఆర్డర్ లో తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో పీీవీపీ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పెద్దగా ఖర్చుపెట్టనప్పటికీ.. ప్రమోషన్ కోసం మాత్రం భారీగా వెచ్చించడానికి సిద్ధమౌతున్నారు. కీరవాణి సంగీతం అందించిన సైజ్ జీరో పాటల్ని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొచ్చి, ఆ తర్వాత భారీ ప్రమోషన్ తో సినిమాను గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో అనుష్క సరసన ఆర్య హీరోగా నటించాడు. ఆర్యకు కోలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాబట్టి… తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి సైజ్ జీరోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, రుద్రమదేవితో ఆకట్టుకున్న బొమ్మాళి, సైజ్ జీరోతో ఇంకెన్ని మేజిక్కులు చేస్తుందో చూడాలి.
Next Story