Telugu Global
Cinema & Entertainment

విజయ్ కోసం విక్రమ్ ను వదిలేసింది..

సౌత్ లో సమంత ఎంత బిజీ హీరోయిన్నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి సమంత సెట్స్ లోనే గడిపేస్తోంది. భవిష్యత్తులో మరో ఏడాదికి సరిపడా కాల్షీట్లు ఇప్పటికే సర్దేసింది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య సమంత ఎప్పీయరెన్స్ కోరుకోవడం అత్యాసే అవుతుంది. అందుకే సమంత ఏం చేసినా ఇప్పుడు చాలా సెలక్టివ్ గా చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొందరిని ఇబ్బంది పెట్టక తప్పదు. కోలీవుడ్ లో అదే జరిగింది. విజయ్ కోసం విక్రమ్ […]

విజయ్ కోసం విక్రమ్ ను వదిలేసింది..
X
సౌత్ లో సమంత ఎంత బిజీ హీరోయిన్నో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు నాలుగేళ్ల నుంచి సమంత సెట్స్ లోనే గడిపేస్తోంది. భవిష్యత్తులో మరో ఏడాదికి సరిపడా కాల్షీట్లు ఇప్పటికే సర్దేసింది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య సమంత ఎప్పీయరెన్స్ కోరుకోవడం అత్యాసే అవుతుంది. అందుకే సమంత ఏం చేసినా ఇప్పుడు చాలా సెలక్టివ్ గా చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొందరిని ఇబ్బంది పెట్టక తప్పదు. కోలీవుడ్ లో అదే జరిగింది. విజయ్ కోసం విక్రమ్ ను ఇబ్బందిపెట్టేసింది సమంత. తమిళనాట విజయ్, విక్రమ్ ఇద్దరితో సినిమాలు చేస్తోంది చుల్ బులీ. వీళ్లలో విక్రమ్ సినిమా దాదాపు సిద్ధమైంది. ప్రమోషన్ కూడా షురూ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రెస్ మీట్ పెడితే దానికి డుమ్మా కొట్టేసింది సమంత. దీనికి కారణం విజయ్. అవును.. ఫామ్ లో ఉన్న విజయ్ సినిమా కోసం విక్రమ్ ప్రెస్ మీట్ కు వెళ్లలేదు సమంత. ఆ విషయాన్ని తనే స్వయంగా ట్వీట్ చేసి మరీ చెప్పింది. విజయ్ సినిమా షూటింగ్ లో ఉన్న కారణంగా విక్రమ్ ప్రెస్ మీట్ కు రాలేకపోతున్నానని క్షమించాలని రాసుకొచ్చింది.
Next Story