Telugu Global
Cinema & Entertainment

పవన్‌ అభిమానుల్లో అసంతృప్తి

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తమ హీరో పవన్‌ కళ్యాణ్‌ని చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తాడని ఆశించిన అభిమానులు చాలా నిరాశపడ్డారు. శనివారం ఉదయం మంత్రులు కామినేని, అయన్నపాత్రుడు వెళ్ళి రామానాయుడి స్టూడియోలో షూటింగ్‌లో ఉన్న పవన్‌కళ్యాణ్‌ని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు స్వయంగా పవన్‌కళ్యాణ్‌ ఇంట్లో ఉన్నాడంటే ఇంటిదగ్గరకు, ఆఫీసులో ఉన్నాడంటే ఆఫీసు దగ్గరకు పరుగులు తీసి పవన్‌కళ్యాణ్‌ను కలుసుకొని, ఆయన ముందు వినయ విధేయతలతో కూర్చుని పవన్‌కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకున్న దృశ్యాలను గుర్తుకుతెచ్చుకుంటున్న అభిమానులు […]

పవన్‌ అభిమానుల్లో అసంతృప్తి
X

అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తమ హీరో పవన్‌ కళ్యాణ్‌ని చంద్రబాబు స్వయంగా ఆహ్వానిస్తాడని ఆశించిన అభిమానులు చాలా నిరాశపడ్డారు. శనివారం ఉదయం మంత్రులు కామినేని, అయన్నపాత్రుడు వెళ్ళి రామానాయుడి స్టూడియోలో షూటింగ్‌లో ఉన్న పవన్‌కళ్యాణ్‌ని కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఎన్నికలప్పుడు చంద్రబాబు స్వయంగా పవన్‌కళ్యాణ్‌ ఇంట్లో ఉన్నాడంటే ఇంటిదగ్గరకు, ఆఫీసులో ఉన్నాడంటే ఆఫీసు దగ్గరకు పరుగులు తీసి పవన్‌కళ్యాణ్‌ను కలుసుకొని, ఆయన ముందు వినయ విధేయతలతో కూర్చుని పవన్‌కళ్యాణ్‌ని ప్రసన్నం చేసుకున్న దృశ్యాలను గుర్తుకుతెచ్చుకుంటున్న అభిమానులు ఎన్నికలప్పుడు పనికొచ్చిన మా హీరో ఇప్పుడు పనికిరాలేదా చంద్రబాబు స్వయంగా వచ్చి ఆహ్వానించడానికి అని అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ని ఆహ్వానించాలనుకుంటున్న చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉంటున్న మా హీరోని స్వయంగా కలిసి ఆహ్వానించలేడా అని ఆవేశపడుతున్నారు.

First Published:  17 Oct 2015 4:04 AM GMT
Next Story