Telugu Global
Cinema & Entertainment

శరవేగంగా ముస్తాబవుతున్న సోగ్గాడు

సోగ్గాడే చిన్ని నాయనా పేరుతో నాగార్జున ఓ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. ఒక పాత్రలో ఆత్మలా, మరో పాత్రలో మనిషిగా కనిపిస్తాడు. మనిషి పాత్రకే ఆత్మ పాత్ర కనిపిస్తుంది. అదీ కథ. ఇలాంటి విభిన్నమైన కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని తేదీలు విడుదలయ్యాయి. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఆడియోను వచ్చేనెల రెండో వారంలో.. సినిమాను […]

శరవేగంగా ముస్తాబవుతున్న సోగ్గాడు
X
సోగ్గాడే చిన్ని నాయనా పేరుతో నాగార్జున ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయంలో కనిపిస్తాడు. ఒక పాత్రలో ఆత్మలా, మరో పాత్రలో మనిషిగా కనిపిస్తాడు. మనిషి పాత్రకే ఆత్మ పాత్ర కనిపిస్తుంది. అదీ కథ. ఇలాంటి విభిన్నమైన కథాంశాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని తేదీలు విడుదలయ్యాయి. సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ఆడియోను వచ్చేనెల రెండో వారంలో.. సినిమాను డిసెంబర్ మూడో వారంలో విడుదల చేయాలని చూచాయగా అనుకున్నారు. మరోవైపు ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ దక్కించుకుంటే.. శాటిలైట్ రైట్స్ ను జెమినీ మూవీస్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. మనం లాంటి విభిన్న చిత్రం తర్వాత నాగార్జున చేస్తున్న మరో విభిన్న చిత్రం కావడంతో సోగ్గాడే చిన్ని నాయనా సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో బ్రహ్మానందం, అనసూయ, హంశా నందిని, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
Next Story