Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ తో గ్రామాల దత్తత కాదట‌

ఎప్పుడో చేయాల్సిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకి రాబోతోంది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల మధ్యలో మహేష్ తో శ్రీమంతుడు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా తారక్-కొరటాల కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమా ఈనెల 25న గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో గెటప్ తో కనువిందు చేయబోతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాతో […]

ఎన్టీఆర్ తో గ్రామాల దత్తత కాదట‌
X
ఎప్పుడో చేయాల్సిన సినిమా ఇప్పుడు సెట్స్ పైకి రాబోతోంది. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల మధ్యలో మహేష్ తో శ్రీమంతుడు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తాజాగా తారక్-కొరటాల కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమా ఈనెల 25న గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో గెటప్ తో కనువిందు చేయబోతున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సినిమాతో ఓ కొత్త ట్రెండ్ సృష్టించబోతున్నాడు ఎన్టీఆర్. సినిమా ఓపెనింగ్ రోజునే తన కొత్త లుక్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు-హీరో మధ్య కథాచర్చలు ముగియడంతో.. ఓపెనింగ్ నుంచే సినిమాపై క్యూరియాసిటీ పెరిగేలే పబ్లిసిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. శ్రీమంతుడు సినిమాలో గ్రామాల దత్తత అంశాన్ని ఇతివృత్తంగా తీసుకున్న కొరటాల, ఎన్టీఆర్ సినిమాకు కూడా ఓ మంచి సందేశాన్నిచ్చే కాన్సెప్ట్ నే ఎంచుకున్నాడని అంటున్నారు. జనవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.
First Published:  16 Oct 2015 7:02 AM GMT
Next Story