Telugu Global
Others

వడ్డీ వ్యాపారం చేసే టీచర్లకు వార్నింగ్

నల్లగొండ డీఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దారి తప్పుతున్న ఉపాధ్యాయులపై కొరడా ఝులిపించారు. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఎవరైనా ఫైనాన్స్, చీటీల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ సర్క్యూలర్ జారీ చేశారు. ఇటీవల చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువైనట్టు నల్లగొండ విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు టీచర్లు పేదలను వేధిస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సొంత వ్యాపారంలో మునిగితేలుతున్న కొందరు టీచర్లు విధులు కూడా సరిగా నిర్వహించడం […]

వడ్డీ వ్యాపారం చేసే టీచర్లకు వార్నింగ్
X

నల్లగొండ డీఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దారి తప్పుతున్న ఉపాధ్యాయులపై కొరడా ఝులిపించారు. ఇకపై ప్రభుత్వ టీచర్లు ఎవరైనా ఫైనాన్స్, చీటీల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ సర్క్యూలర్ జారీ చేశారు. ఇటీవల చిటీలు, వడ్డీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువైనట్టు నల్లగొండ విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వడ్డీ వ్యాపారం పేరుతో కొందరు టీచర్లు పేదలను వేధిస్తున్నట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. సొంత వ్యాపారంలో మునిగితేలుతున్న కొందరు టీచర్లు విధులు కూడా సరిగా నిర్వహించడం లేదని శాఖపరమైన విచారణలో తేలింది.

దీంతో నల్లగొండ డీఈవో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వడ్డీలు, చీటీల వ్యాపారం చేసే ఉపాధ్యాయులను గుర్తించి వారి వివరాలను పంపాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు వడ్డీవ్యాపారాలు చేస్తూ జనాన్ని వేధించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని అభిప్రాయపడ్డారు . అలాంటి వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవంటూ సర్క్యూలర్ జారీ చేశారు.

First Published:  15 Oct 2015 11:43 PM GMT
Next Story