Telugu Global
Others

'తులసి' వల్ల ఎన్నో ఉపయోగాలు.. మీకు తెలుసా!

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో అంతే ప్రాధాన్యత వహిస్తుంది. సహజంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషధ మొక్కలు పెంచుకుంటే ఇంట్లో ఉండే అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. తులసిలో ఎన్నో రకాలున్నప్పటికీ ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి మాత్రమే వాసికెక్కాయి. ఈ రెండు రకాలనే ఎక్కవగా ఔషధ సేవనంలో కూడా వాడతారు. ప్రకృతి వైద్యంలో తులసిది విడదీయరాని బంధం. అందుకే సహజ వైద్యంలో తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. వాకిట్లోను, ఇంటి […]

తులసి వల్ల ఎన్నో ఉపయోగాలు.. మీకు తెలుసా!
X
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో అంతే ప్రాధాన్యత వహిస్తుంది. సహజంగా ఇంటిల్లిపాదికి ఉపయోగపడే ఔషధ మొక్కలు పెంచుకుంటే ఇంట్లో ఉండే అన్నివయస్సుల వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. తులసిలో ఎన్నో రకాలున్నప్పటికీ ప్రధానంగా రామ తులసి, కృష్ణ తులసి మాత్రమే వాసికెక్కాయి. ఈ రెండు రకాలనే ఎక్కవగా ఔషధ సేవనంలో కూడా వాడతారు. ప్రకృతి వైద్యంలో తులసిది విడదీయరాని బంధం. అందుకే సహజ వైద్యంలో తులసికి మొదటి ప్రాధాన్యతనిస్తారు. వాకిట్లోను, ఇంటి ముందు కుండీల్లోను చక్కగా పెంచుకుని పవిత్రంగా పూజించే తులసి వల్ల ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం…
తులసి… కొన్ని ఆరోగ్య రహస్యాలు
  • తులసి మొక్కలు నోటిపూత, నోట్లో అల్సర్స్, ఇతర ఇన్‌ఫెక్షన్ల నివారణకు ఎంతో ఉపకరిస్తుంది.
  • ప్రధానంగా చిన్నపిల్లల్లో తరచూ వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులకు ఇది ఉపకరిస్తుంది.
  • తులసి ఆకులను డికాషన్‌గా తీసుకుని తలనొప్పిని దూరం చేసుకోవచ్చు.
  • తులసి ఆకులను ఎండబెట్టి, వాటిని పొడి చేసి, దాంతో పళ్ళు తోముకుంటే దంత రక్షణకు మేలు చేస్తుంది. దీన్ని ఆవనూనెలో కలిపి టూత్‌పేస్ట్‌లా వాడుకుంటే దంతక్షయంతోపాటు నోటి దుర్వాసన పోయి, పళ్ళు అందంగా తయారవుతాయి.
  • రోజూ ఒక తులసి ఆకు తింటే నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించే శక్తిగా పని చేస్తుంది.
  • వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయంలా తయారు చేసి అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది.
  • బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ప్రతిరోజు ఐదారు ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులి పురుగు నశిస్తుంది.
  • ఎండిన తులసి ఆకులను కీటకాలను దూరంగా ఉంచడం కోసం ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉంచుతారు.
  • ఆకుల రసం (పసరు)గా, ఎండిన ఆకుల పొడిగా, హెర్బల్ టీగా, నేతిలో మరగ పెట్టడం ద్వారా… ఇలా తులసిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చు.
  • తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి ఉండటంతో డయాబెటిస్ ఉన్న వారికి చక్కగా పనికొస్తుంది.
  • రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.
  • తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
ఇలా వివిధ రూపాల్లో తీసుకోవడంతోపాటు రక్తంలో కోలెస్టరాల్ తగ్గించడానికీ, ‘యాంటీ ఆక్సిడెంట్’ గుణం కలిగిన తులసి ఆకులు బ్లడ్ షుగర్ తగ్గించడానికీ తీసుకోవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
First Published:  16 Oct 2015 12:42 AM GMT
Next Story