Telugu Global
Cinema & Entertainment

అర్జెంట్‌గా కంచె వేసేసారు!

అనుకోకుండా అఖిల్ డెబ్యూ మూవీ పోస్ట్‌పోన్ అయ్యింది. ఆ స్లాట్‌లోకి ఏదో ఒక మూవీ వస్తుందని అందరికీ తెలిసినదే. ఎక్కువ శాతం కళ్యాణ్ రామ్ ‘షేర్’ వచ్చే చాన్స్ ఉందని అనుకున్నారు. ఎందుకో నాందమూరి హీరో ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కాని మెగాహీరో వరుణ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్ మూవి ‘కంచె’ 22 అక్టోబర్ న వస్తుందనే లేటెస్ట్ ప్రకటన వచ్చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. కాని, కావాలనే మెగా హీరోల కోసమే ‘అఖిల్ ‘ […]

అర్జెంట్‌గా కంచె వేసేసారు!
X

అనుకోకుండా అఖిల్ డెబ్యూ మూవీ పోస్ట్‌పోన్ అయ్యింది. ఆ స్లాట్‌లోకి ఏదో ఒక మూవీ వస్తుందని అందరికీ తెలిసినదే. ఎక్కువ శాతం కళ్యాణ్ రామ్ ‘షేర్’ వచ్చే చాన్స్ ఉందని అనుకున్నారు. ఎందుకో నాందమూరి హీరో ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కాని మెగాహీరో వరుణ్ తేజ్ – క్రిష్ కాంబినేషన్ మూవి ‘కంచె’ 22 అక్టోబర్ న వస్తుందనే లేటెస్ట్ ప్రకటన వచ్చేసింది. ఇంతవరకు బాగానే ఉంది.
కాని, కావాలనే మెగా హీరోల కోసమే ‘అఖిల్ ‘ సినిమా వాయిదా వేసాడని అక్కినేని ఫ్యాన్స్ నితిన్‌పై గుర్రుగా ఉన్నరు. సోషల్ మీడియాలో ఇప్పటికే యుధ్ధం జరుగుతోంది ఇరువర్గాల అభిమానుల మధ్య. ‘అఖిల్ ‘ వలన ఏర్పడిన స్లాట్‌పై ఇంకో మెగాహీరో వరుణ్ తేజ్ వెంటనే కర్చీఫ్ వేయడం జీర్ణించుకోలేక పోతున్నారు. దసరా స్లాట్ మిస్ చేయడం అనేది చాలా పెద్ద పొరబాటుగా అభిమానులు భావిస్తున్నారు. సినిమా బిజినెస్ పరంగా ఈ సీజన్ ఒక సువర్ణ అవకాశం లాంటిది మరి. ఏది ఏమైయినా ఈ దసరా అంతా మెగాహీరోల సందడే కనిపిస్తోంది. ‘రుద్రమదేవి’ తో అల్లు అర్జుణ్, ‘బ్రూస్ లీ’ తో రామ్ చరణ్, ఇక ఇప్పుడు ‘కంచె’ తో వరుణ్ తేజ్.

Next Story