Telugu Global
Cinema & Entertainment

అనుకున్నట్లే డిసప్పాయింట్ చేసాడు అఖిల్

అక్టోబర్ 22న వస్తున్నాడని అక్కినేని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాని అనుకోకుండా అఖిల్ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యింది. టెక్నికల్ కారణాల వలన పోస్ట్‌పోన్ అయ్యిందని లేటెస్ట్ సమాచారం. అఖిల్ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తికాలేదని, ఇదే డిలేకి కారణం అని తెలుస్తోంది. సడన్‌గా 22 అక్టోబర్ స్లాట్ ఖాళీ అయ్యింది. పెద్ద సినిమా ఉందని… చిన్న సినిమాలు బ్యాక్ అవుట్ అయ్యాయి. మరి ఇప్పుడు వచ్చిన గ్యాప్‌ని […]

అనుకున్నట్లే డిసప్పాయింట్ చేసాడు అఖిల్
X

అక్టోబర్ 22న వస్తున్నాడని అక్కినేని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాని అనుకోకుండా అఖిల్ డెబ్యూ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ అయ్యింది. టెక్నికల్ కారణాల వలన పోస్ట్‌పోన్ అయ్యిందని లేటెస్ట్ సమాచారం. అఖిల్ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తికాలేదని, ఇదే డిలేకి కారణం అని తెలుస్తోంది. సడన్‌గా 22 అక్టోబర్ స్లాట్ ఖాళీ అయ్యింది. పెద్ద సినిమా ఉందని… చిన్న సినిమాలు బ్యాక్ అవుట్ అయ్యాయి.
మరి ఇప్పుడు వచ్చిన గ్యాప్‌ని నింపడానికి ప్రస్తుతం బరిలో ఉన్న సినిమా.. కళ్యాణ్ రామ్ యొక్క ‘షేర్ ‘. ఇంకా వారం టైం ఉంది కనుక, తన సినిమా రిలీజ్‌కు ‘షేర్ ‘ సినిమా ప్రొడ్యూసర్స్ కోరుకుంటే ఈ స్లాట్‌ని వినియోగించుకోవచ్చు. దీనివలన ‘షేర్ ‘ కి ఎంత లాభం కలుగుతుందో తెలియదు కాని, రామ్ చరణ్ ‘బ్రూస్ లీ ‘ కి మాత్రం చాలా ఎడ్వాంటేజ్ కలిగే చాన్సెస్ ఉన్నాయని మాత్రం ట్రేడ్ పండితుల అంచనా. మరి చూద్దాం ఏం జరుగుతుందో!

First Published:  15 Oct 2015 7:03 PM GMT
Next Story