Telugu Global
Others

క్రికెట్‌కు జ‌హీర్ ఖాన్ గుడ్‌బై !

టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్‌ఖాన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నాడు. ఆయ‌న రిటైర్ అవుతున్నాడ‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ రోజు చేసిన ట్వీట్ కార‌ణంగా ఈ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. కొంత‌కాలంగా గాయాలు, ఫిట్‌నెస్ లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అంతర్జాతీయ జ‌ట్టులో జ‌హీర్‌ఖాన్  నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోతున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. గంగూలీ సార‌థ్యంలో జ‌హీర్‌కు మంచి […]

క్రికెట్‌కు జ‌హీర్ ఖాన్ గుడ్‌బై !
X
టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్‌ఖాన్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్ప‌నున్నాడు. ఆయ‌న రిటైర్ అవుతున్నాడ‌న్న వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్‌గా మారింది. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ రోజు చేసిన ట్వీట్ కార‌ణంగా ఈ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. కొంత‌కాలంగా గాయాలు, ఫిట్‌నెస్ లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల అంతర్జాతీయ జ‌ట్టులో జ‌హీర్‌ఖాన్ నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోతున్నాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. గంగూలీ సార‌థ్యంలో జ‌హీర్‌కు మంచి ప్రాధాన్యం ఉండేది.
2000లో బంగ్లాదేశ్‌లో జ‌రిగిన వ‌న్డే ద్వారా జ‌హీర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. 37 ఏళ్ల జహీర్ ఖాన్ టీమిండియా 2011లో వన్డే ప్రపంచకప్ సాధించడంలో కీలకభూమిక పోషించాడు. ఈ మెగా టోర్నిలో 21 వికెట్లు పడగొట్టి ఆఫ్రిదితో కలిసి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఇప్ప‌టిదాకా 200 వన్డేల్లో 282 వికెట్లు తీశాడు, 92 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు, 17 టి20 మ్యాచ్ లు ఆడి 17 వికెట్లు దక్కించుకున్నాడు. గంగూలీ సార‌థ్యంలో జ‌ట్టులో కీల‌క బౌల‌ర్‌గా మారాడు. ఎడ‌మ‌చేతి వాటం గ‌ల ఫాస్ట్ బౌల‌ర్‌గా భార‌త జ‌ట్టులో జ‌హీర్ ఖాన్ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ త‌రువాత జ‌ట్టులోకి ఇర్పాన్ ఖాన్ రూపంలో ఎడ‌మ చేతి ఫాస్ట్ బౌల‌ర్ దొరికినా నిల‌క‌డ‌గా రాణించ‌లేక‌పోయాడు. ఇప్ప‌టికీ జ‌ట్టులో స‌రైన ఎడ‌మ‌చేతి వాటం గ‌ల బౌల‌ర్ లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.
First Published:  15 Oct 2015 1:26 AM GMT
Next Story