Telugu Global
Others

తెలంగాణాలో పార్టీ ఖర్చుల కోసం ఆంధ్ర‌ అసెంబ్లీ కాంట్రాక్టు ?

డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాలను తుళ్లూరులోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొద్దిరోజుల క్రితం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఫైబర్ బీమ్స్ సాయంతో అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టు సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు రేస్‌లోకి దూకారు. ఏపీ నేతలు కాంట్రాక్టు తమకేనని చాలా కాలం క్రితమే డిసైడ్ అయిపోయారు. అయితే […]

తెలంగాణాలో పార్టీ ఖర్చుల కోసం ఆంధ్ర‌ అసెంబ్లీ కాంట్రాక్టు ?
X

డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ సమావేశాలను తుళ్లూరులోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం కొద్దిరోజుల క్రితం స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఉన్నతాధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. ఐదెకరాల విస్తీర్ణంలో ఫైబర్ బీమ్స్ సాయంతో అసెంబ్లీకి సంబంధించిన నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు.

ప్రభుత్వ నిర్ణయంతో ఏపీ అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టు సొంతం చేసుకునేందుకు టీడీపీ నేతలు రేస్‌లోకి దూకారు. ఏపీ నేతలు కాంట్రాక్టు తమకేనని చాలా కాలం క్రితమే డిసైడ్ అయిపోయారు. అయితే ఊహించని రీతిలో ఏపీ తెలుగు తమ్ముళ్లకు తెలంగాణ టీడీపీ నేత నుంచి పోటీ ఎదురైంది. వరంగల్ జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్‌రావు అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారని సమాచారం. అసెంబ్లీ నిర్మాణంపై స్పీకర్‌కు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే ఏపీ టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. కొత్తకొత్త అంశాలను తెరపైకి తెచ్చి కాంట్రాక్టు గరికపాటికి దక్కకుండా చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ప్రతిష్టాత్మక అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టులు తెలంగాణ వారికి అప్పగిస్తే ఏపీలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని స్పీకర్, సీఎం వద్ద ఏపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాక చంద్రబాబును బాగా తిట్టి టీడీపీలో చేరన తుమ్మలకు గరికపాటి స్వయంగా వియంకుడవుతారు. దీన్ని కూడా చూపించి ఆయనకు కాంట్రాక్టు దక్కకుండా చేసేందుకు ఏపీ టీడీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారని సమాచారం.

గరికపాటి మోహన్ రావు కూడా అంతేస్థాయిలో తన వాదన వినిపిస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణలో పార్టీ కోసం భారీ డబ్బులు ఖర్చు చేశానని ఇలాంటి కాంట్రాక్టులు కూడా ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని రుసరుసలాడుతున్నారని తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ నడవాలంటే డబ్బలు అవసరమని… కాబట్టి ఏపీలో తమకు అవకాశాలు కల్పించాల్సిందేనని వాదిస్తున్నారు.

తుమ్మలతో బంధుత్వం అన్న పాయింట్‌ను కొట్టిపారేస్తున్నారు. తుమ్మల టీడీపీలో ఉన్నప్పుడే తమ బంధుత్వం కలిసిందని ఆయన ఇప్పుడు పార్టీ మారితే దానికి తానెలా బాధ్యుడిని అవుతానని ప్రశ్నిస్తున్నారు. తుమ్మలతో బంధుత్వం ఉన్నా కూడా ఆయన నుంచి తాను ఎలాంటి లబ్ధి పొండడం లేదని గరికపాటి చెబుతున్నారని సమాచారం. అయితే ఈ పరిణామంపై స్పీకర్ గానీ,ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ సూటిగా స్పందించడం లేదని చెబుతున్నారు. టెండర్ల పక్రయ ముందుకు సాగనివ్వండి అంటూ దాటేస్తున్నారట.

First Published:  15 Oct 2015 2:06 AM GMT
Next Story