Telugu Global
Cinema & Entertainment

ఆ ఇద్దరితో ఆమెకు ఇది మూడవసారి

కొన్ని కొన్ని కాంబినేషన్స్ అట్లా వర్క్అవుట్ అవుతాయి మరి.. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా. ఇక్కడ ఆ స్టార్ పేరు శృతి హాసన్ .. ఆమె ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు తో ముచ్చటగా మూడవసారి జతకలుస్తున్నదట. మొన్న వచ్చిన ‘శ్రీమంతుడు’ లో ‘జత కలిసే జత కలిసే’ పాట ఎంత హిట్ అయ్యిందో… వారిద్దరి జంట కూడా అంతే హిట్ అయ్యింది. మొదటిసారి ‘ఆగడు’ సినిమాలో మహేష్‌తో ఐటెమ్ సాంగ్‌కి ఆడీ పాడింది. ఇప్పుడిక ముచ్చటగా […]

ఆ ఇద్దరితో ఆమెకు ఇది మూడవసారి
X

కొన్ని కొన్ని కాంబినేషన్స్ అట్లా వర్క్అవుట్ అవుతాయి మరి.. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా. ఇక్కడ ఆ స్టార్ పేరు శృతి హాసన్ .. ఆమె ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు తో ముచ్చటగా మూడవసారి జతకలుస్తున్నదట. మొన్న వచ్చిన ‘శ్రీమంతుడు’ లో ‘జత కలిసే జత కలిసే’ పాట ఎంత హిట్ అయ్యిందో… వారిద్దరి జంట కూడా అంతే హిట్ అయ్యింది.
మొదటిసారి ‘ఆగడు’ సినిమాలో మహేష్‌తో ఐటెమ్ సాంగ్‌కి ఆడీ పాడింది. ఇప్పుడిక ముచ్చటగా మూడవసారి కూడా సినిమా చేయబోతోంది. ఈ సినిమా ప్రముఖ డైరెక్టర్ మురుగదాస్ తో ఉంటుందట. మహేష్‌కి మురుగదాస్‌తో ఇది మొదటి సినిమానే కానీ.. శృతి హాసన్‌కు మాత్రం ఇది ఫస్ట్ టైం కాదు.
గతంలో మురుగదాస్ ‘సెవెంత్ సెన్స్’ సినిమాలో కూడా శృతినే హీరోయిన్. మురుగదాస్ నిర్మించిన తమిళ చిత్రం ‘మాన్ కరాటే’ కోసం ఒక పాట పాడింది. సో వచ్చే సంవత్సరం మొదలవ్వబోయే మహేష్ సినిమా, శృతికి ఫిల్మ్ మేకర్ మురుగదాస్‌తో మూడవ సినిమానే కదా!

First Published:  14 Oct 2015 7:03 PM GMT
Next Story