Telugu Global
Cinema & Entertainment

మాయమాటలు చెబుతున్న చెర్రీ

సినీ పరిశ్రమను శాసించే మోగాస్టార్ చిరుకు ఏకైక కుమారుడు. దేశంలో వైద్యరంగాన్ని ఏలుతున్న అపోలో ప్రతాప్ రెడ్డి మనవరాలికి భర్త. వరుసగా సినిమాలు చేస్తున్న క్రేజీ హీరో. ఏకంగా విమానాలే నడుపుతున్న కుర్రపారిశ్రామిక వేత్త. ఇన్ని ట్యాగ్ లైన్లను మెడలో వేసుకుని తిరుగుతున్న హీరో రామ్‌చరణ్ గ్రామాల దత్తతుపై అందరికీ దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు. తాను ఈతాకు లాంటి వాడినని… ఈదురు గాలులు వచ్చినా తన నుంచి కాసులు రాలే ప్రసక్తే ఉండదని నిరూపించుకున్నారు. ఇంతకీ ఏమైందంటే… ఈ […]

మాయమాటలు చెబుతున్న చెర్రీ
X

సినీ పరిశ్రమను శాసించే మోగాస్టార్ చిరుకు ఏకైక కుమారుడు. దేశంలో వైద్యరంగాన్ని ఏలుతున్న అపోలో ప్రతాప్ రెడ్డి మనవరాలికి భర్త. వరుసగా సినిమాలు చేస్తున్న క్రేజీ హీరో. ఏకంగా విమానాలే నడుపుతున్న కుర్రపారిశ్రామిక వేత్త. ఇన్ని ట్యాగ్ లైన్లను మెడలో వేసుకుని తిరుగుతున్న హీరో రామ్‌చరణ్ గ్రామాల దత్తతుపై అందరికీ దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారు. తాను ఈతాకు లాంటి వాడినని… ఈదురు గాలులు వచ్చినా తన నుంచి కాసులు రాలే ప్రసక్తే ఉండదని నిరూపించుకున్నారు.

ఇంతకీ ఏమైందంటే… ఈ మధ్య హీరోలు, ప్రముఖులు గ్రామాల దత్తతు తీసుకునే ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉండబట్టలేక ఓ మీడియా ప్రతినిధి ”మీరు గ్రామాన్ని దత్తతు తీసుకోవడం లేదా” అని చరణ్‌ను ప్రశ్నించారు. అంతే ఏమాత్రం తత్తరపాటు లేకుండా బాగా డబ్బు సంపాదించాక చూద్దాం అంటూ సమాధానం చెప్పారు. డబ్బు సంపాదించాక ఏదైనా గ్రామాన్ని దత్తతు తీసుకుంటానన్నారు. చరణ్ సమాధానంతో ప్రశ్న అడిగిన విలేకరే కాదు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. చెర్రీబాగానే మాయమాటలు చెబుతున్నాడని అక్కడ ఉన్న విలేకరులు చర్చించుకుంటూ ఏంటి డబ్బులు సంపాదించి గ్రామాన్ని దత్తతు తీసుకుంటారా… అంటే ఇప్పుడు డబ్బులు లేవా మేం నమ్మాలా అని లోలోన నవ్వుకున్నారు. తాము జిల్లా మొత్తాన్ని దత్తతు తీసుకోమనడం లేదని… కేవలం ఒక గ్రామం దత్తతు గురించే అడిగామని సెటైర్లు వేసుకుంటూ వెళ్లిపోయారు.

First Published:  14 Oct 2015 8:01 PM GMT
Next Story