Telugu Global
Cinema & Entertainment

నాలుగు క్షణాలలో రవితేజాను తినేసింది

‘కిక్-2’ వచ్చింది… వెళ్ళిపోయింది. మాస్ మహరాజా రవితేజ కి ఒరిగిందేమీ లేదు.. ఒక ఫ్లాపును మూటగట్టడం తప్ప. ఇక రాబోయే సినిమా ‘బెంగాల్ టైగర్ పైనే అభిమానుల ఆశలన్నీ పెట్టుకున్నారు. రవితేజ తన మూస మాస్ ఫార్ములా నుండి ఇకనైనా బయటికి వస్తాడా అని క్రిటిక్స్ ఎదురు చూస్తున్నారు. కాని మాస్ మహారాజా మాత్రం తన పాత పంథానే కొనసాగించబోతున్నాడని.. బుధవారం విడుదల చేసిన టీజర్ చెప్పకనే చెపుతోంది. అవే ఫైట్లు, అవే మాస్ డైలాగ్స్, అవే […]

నాలుగు క్షణాలలో రవితేజాను తినేసింది
X

‘కిక్-2’ వచ్చింది… వెళ్ళిపోయింది. మాస్ మహరాజా రవితేజ కి ఒరిగిందేమీ లేదు.. ఒక ఫ్లాపును మూటగట్టడం తప్ప. ఇక రాబోయే సినిమా ‘బెంగాల్ టైగర్ పైనే అభిమానుల ఆశలన్నీ పెట్టుకున్నారు. రవితేజ తన మూస మాస్ ఫార్ములా నుండి ఇకనైనా బయటికి వస్తాడా అని క్రిటిక్స్ ఎదురు చూస్తున్నారు. కాని మాస్ మహారాజా మాత్రం తన పాత పంథానే కొనసాగించబోతున్నాడని.. బుధవారం విడుదల చేసిన టీజర్ చెప్పకనే చెపుతోంది.
అవే ఫైట్లు, అవే మాస్ డైలాగ్స్, అవే పాటలు, అవే పంచ్ సింగిల్ లైనర్స్.. ఇవీ టీజర్ ముఖ్యాంశాలు. కాని నాలుగే నాలుగు సెకండ్లు కనిపించిన మిల్కీ బ్యూటీ తమన్నా తన హాట్ బాడీతో కబడ్డీ ఆడించేసింది. ఆమె హావభావాలు వెన్నులో వేడి పుట్టించడం ఖాయం. చూస్తేనే మతిపోయేలా కనిపించి ఊరించింది. టీజర్ చివరలో తమన్నా కనిపించడం వలన, రవితేజను తినేసి.. అంతా తనే అన్నంత గాఢంగా ముద్ర వేసింది తన హాట్ హాట్ లుక్స్‌తో తమన్నా.

Next Story