Telugu Global
CRIME

రామేశ్వరాన్ని జల్లెడ పడుతున్న భద్రతాదళాలు

శ్రీలంక నుంచి తీవ్రవాదులు రామేశ్వరంలోకి అడుగుపెట్టారన్న వార్త ఇంటిలిజెన్స్‌ వర్గాలను కలవరానికి గురి చేస్తోంది. అర్ధరాత్రి ఓ ఫైబర్‌ పడవలో కొంతమంది వ్యక్తులు రామేశ్వరంలో దిగినట్టు స్థానికులు చెబుతున్నారు. వారు పడవ దిగిన వెంటనే పరుగులు పెడుతూ చీకట్లోకి వెళ్ళిపోయారని, బహుశా రామేశ్వరం పరిసర ప్రాంతంలోనే వారు ఉండవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదులు ఎంతమంది అన్నది చీకట్లో గుర్తించలేకపోయామని జాలరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు వదిలి వెళ్లిన ఫైబర్‌ పడవను పోలీసులకు స్వాధీనం చేశారు. రామేశ్వరంలో ఉన్న […]

శ్రీలంక నుంచి తీవ్రవాదులు రామేశ్వరంలోకి అడుగుపెట్టారన్న వార్త ఇంటిలిజెన్స్‌ వర్గాలను కలవరానికి గురి చేస్తోంది. అర్ధరాత్రి ఓ ఫైబర్‌ పడవలో కొంతమంది వ్యక్తులు రామేశ్వరంలో దిగినట్టు స్థానికులు చెబుతున్నారు. వారు పడవ దిగిన వెంటనే పరుగులు పెడుతూ చీకట్లోకి వెళ్ళిపోయారని, బహుశా రామేశ్వరం పరిసర ప్రాంతంలోనే వారు ఉండవచ్చని భావిస్తున్నారు. ఉగ్రవాదులు ఎంతమంది అన్నది చీకట్లో గుర్తించలేకపోయామని జాలరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులు వదిలి వెళ్లిన ఫైబర్‌ పడవను పోలీసులకు స్వాధీనం చేశారు. రామేశ్వరంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ పోలీసులు, సముద్ర తీర భద్రతాదళం, సాధారణ పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకుని పరిశీలించారు. ప్రస్తుతం తీవ్రవాదుల కోసం రామేశ్వరంలో జల్లెడ పడుతున్నారు. సముద్రతీరంలో వున్న 18 అడుగుల పొడవు, ఏడడుగుల వెడల్పు వున్న ఆ ఫైబర్‌ పడవపై ఉన్న రిజిస్ట్రేషన్‌ నెంబర్లు తదితర వివరాలతో అది శ్రీలంకకు చెందినదిగా తీర గస్తీదళం గుర్తించింది. ఆ పడవలో ఒక ఇంజన్‌, వలలు, పడవ ప్రమాదానికి గురైతే రక్షణకు పనికి వచ్చే పరికాలు ఉన్నాయి. వాటిని స్వాథీనం చేసుకున్నారు. వీరు శ్రీలంకకు చెందిన ఉగ్రవాదులా లేక ఇతర దేశాల నుంచి శ్రీలంకకు వచ్చి అక్కడ నుంచి భారత్‌లో ప్రవేశించినవారా అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నారు.

First Published:  13 Oct 2015 4:01 PM GMT
Next Story