Telugu Global
Cinema & Entertainment

నిహారిక ఎంట్రీపై అనుమానాలు క్లియర్..

మెగా కాంపౌండ్ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే సంబరపడేంతగా.. ఓ హీరోయిన్ వస్తుందంటే అభిమానులు పెద్దగా సంబరపడరు. మొన్నటివరకు నిహారిక ఎంట్రీకి ఇవే ప్రతిబంధకాలుగా మారాయి. నాగబాబు ఒప్పుకున్నప్పటికీ.. మెగాస్టార్ ఒప్పుకోకపోతే నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరగదు. కానీ చిరంజీవి ఇప్పటివరకు నిహారిక గురించి మాట్లాడలేదు. దీంతో ఆమె తెరపైకి వచ్చేది అనుమానమే అనుకున్నారంతా. కానీ మెగాకాంపౌండ్ నుంచి నిహారిక ఎంట్రీకి సంబంధించి మరో రూపంలో క్లారిటీ వచ్చేసింది. ఈసారి స్పష్టత ఇచ్చింది ఏకంగా రామ్ […]

నిహారిక ఎంట్రీపై అనుమానాలు క్లియర్..
X
మెగా కాంపౌండ్ నుంచి ఓ హీరో వస్తున్నాడంటే సంబరపడేంతగా.. ఓ హీరోయిన్ వస్తుందంటే అభిమానులు పెద్దగా సంబరపడరు. మొన్నటివరకు నిహారిక ఎంట్రీకి ఇవే ప్రతిబంధకాలుగా మారాయి. నాగబాబు ఒప్పుకున్నప్పటికీ.. మెగాస్టార్ ఒప్పుకోకపోతే నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ జరగదు. కానీ చిరంజీవి ఇప్పటివరకు నిహారిక గురించి మాట్లాడలేదు. దీంతో ఆమె తెరపైకి వచ్చేది అనుమానమే అనుకున్నారంతా. కానీ మెగాకాంపౌండ్ నుంచి నిహారిక ఎంట్రీకి సంబంధించి మరో రూపంలో క్లారిటీ వచ్చేసింది. ఈసారి స్పష్టత ఇచ్చింది ఏకంగా రామ్ చరణ్. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న రామ్ చరణ్.. నిహారిక ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చని ప్రకటించాడు. తన సోదరికి తన నుంచి పూర్తి సపోర్టు ఉంటుందని ప్రకటించాడు. చెర్రీ చెప్పినా చిరంజీవి చెప్పినా ఒక్కటే కాబట్టి నిహారిక ఆన్ స్క్రీన్ ఎంట్రీ కన్ ఫర్మ్ అయినట్టే.
Next Story