Telugu Global
Cinema & Entertainment

తెలుగుతెరపైకి మోహన్ లాల్

మోహన్ లాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు చాలామందికి సుపరిచితమే. తన యాక్టింగ్ స్కిల్స్ తో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఈ లెజెండరీ నటుడు.. టాలీవుడ్ లో కూడా ఎంతోమంది అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. అయితే మోహన్ లాల్ తెలుగులో నటించిన సినిమాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. దాదాపు 2 దశాబ్దాల కిందట వచ్చిన గాండీవం అనే సినిమాలో మాత్రమే నేరుగా నటించాడు మోహన్ లాల్. ఆ మూవీలో ఏఎన్నారో కలిసి గోరువంక వాలగానే గోపురానికి.. అనే సాంగ్ […]

తెలుగుతెరపైకి మోహన్ లాల్
X
మోహన్ లాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు చాలామందికి సుపరిచితమే. తన యాక్టింగ్ స్కిల్స్ తో దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న ఈ లెజెండరీ నటుడు.. టాలీవుడ్ లో కూడా ఎంతోమంది అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు. అయితే మోహన్ లాల్ తెలుగులో నటించిన సినిమాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ. దాదాపు 2 దశాబ్దాల కిందట వచ్చిన గాండీవం అనే సినిమాలో మాత్రమే నేరుగా నటించాడు మోహన్ లాల్. ఆ మూవీలో ఏఎన్నారో కలిసి గోరువంక వాలగానే గోపురానికి.. అనే సాంగ్ లో కనిపిస్తాడు. తర్వాత పూర్తిగా డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఈసారి మాత్రం నేరుగా ఓ తెలుగు సినిమాలో మోహన్ లాల్ నటించే అవకాశముంది. విలక్షణ సినిమాల సృష్టికర్త చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మోహన్ లాల్ నటించడానికి సూత్రప్రాయంగా అంగీకరించాడు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తెలుగు-తమిళ-కన్నడ-మలయాళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.
Next Story