నేడు మెడికల్ షాపుల బంద్ ఎందుకంటే ?
నేడు( బుధవారం 14-10-15) దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ షాపులు తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి నిరసనగా మెడికల్ షాపుల యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆన్‌లైన్‌లో మందుల విక్రయం ద్వారా అనేక చెడు పరిణామాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ వ్యాపారం వల్ల నకిలీలు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. పైగా డ్రగ్స్, నిద్ర మాత్రలను ఇష్టానుసారం సరపరా చేసే ప్రమాదం ఉందని […]
నేడు( బుధవారం 14-10-15) దేశ వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ షాపులు తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడానికి నిరసనగా మెడికల్ షాపుల యూనియన్లు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆన్‌లైన్‌లో మందుల విక్రయం ద్వారా అనేక చెడు పరిణామాలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్ లైన్ వ్యాపారం వల్ల నకిలీలు పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. పైగా డ్రగ్స్, నిద్ర మాత్రలను ఇష్టానుసారం సరపరా చేసే ప్రమాదం ఉందని అంటున్నారు. అంతే కాదు రిటైల్ మెడికల్ సాపుల వ్యాపారం దెబ్బతింటే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది.. ప్రభుత్వానికి పన్నులు కూడా సరిగా రావంటున్నారు. దేశ వ్యాప్తంగా దాదాపు 8లక్షల మెడికల్ షాపులు నేడు బంద్‌లో పాల్గొంటున్నాయి.