Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సరసన కందిరీగ భామ

ప్రస్తుతం తన 99వ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు బాలయ్య. శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను ఎంపికచేశారు. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో భామను కూడా తీసుకున్నారు. కందిరీగ సినిమాతో అందర్నీ మెప్పించిన అక్షను బాలయ్య సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీవాస్ కన్ ఫర్మ్ చేశాడు. కథకు తగ్గట్టు మరో […]

బాలయ్య సరసన కందిరీగ భామ
X
ప్రస్తుతం తన 99వ సినిమా పనిలో బిజీగా ఉన్నాడు బాలయ్య. శ్రీవాస్ దర్శకత్వంలో డిక్టేటర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లను ఎంపికచేశారు. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడో భామను కూడా తీసుకున్నారు. కందిరీగ సినిమాతో అందర్నీ మెప్పించిన అక్షను బాలయ్య సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీవాస్ కన్ ఫర్మ్ చేశాడు. కథకు తగ్గట్టు మరో హీరోయిన్ అవసరమైన సందర్భంలో అక్ష ఎంట్రీ ఇస్తుందని ప్రకటించాడు. అయితే సినిమాలో అక్ష ముగ్గురు భామల్లో ఒకరిగా కనిపిస్తుందా.. లేక ఐటెం సాంగ్ చేయబోతుందా అనే విషయాన్ని మాత్రం మేకర్స్ కన్ ఫర్మ్ చేయలేదు. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. సినిమాలో ఓ అద్భుతమైన ఐటెంసాంగ్ కోసమే అక్షను తీసుకున్నారని తెలుస్తోంది. మరి దీనికి సినిమా యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అటు బాలయ్య డిక్టేటర్ సినిమా ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తిచేసుకోవడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
Next Story