Telugu Global
Cinema & Entertainment

శ్రీనువైట్ల దర్శకత్వంలో సిసింద్రీ

అఖిల్ సినిమా విడుదలకావడానికి ఇంకా టైం ఉంది. ఈ గ్యాప్ లోనే అఖిల్ చేయాల్సిన రెండో సినిమా కన్ ఫర్మ్ అయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుంది. ఈ విషయాన్ని అక్కినేని కాంపౌండ్ చూచాయగా కన్ ఫర్మ్ చేసింది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల బ్రూస్ లీ సినిమా పనిలో బిజిగా ఉన్నాడు. అటు అఖిల్ కూడా తన తొలి సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. […]

శ్రీనువైట్ల దర్శకత్వంలో సిసింద్రీ
X

అఖిల్ సినిమా విడుదలకావడానికి ఇంకా టైం ఉంది. ఈ గ్యాప్ లోనే అఖిల్ చేయాల్సిన రెండో సినిమా కన్ ఫర్మ్ అయింది. శ్రీనువైట్ల దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా ఉంటుంది. ఈ విషయాన్ని అక్కినేని కాంపౌండ్ చూచాయగా కన్ ఫర్మ్ చేసింది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుంది. ప్రస్తుతం శ్రీనువైట్ల బ్రూస్ లీ సినిమా పనిలో బిజిగా ఉన్నాడు. అటు అఖిల్ కూడా తన తొలి సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్ లు థియేటర్లలోకి వచ్చిన తర్వాత అఖిల్-శ్రీనువైట్ల కాంబినేషన్ పై ఓ క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికైతే అఖిల్ సినిమాకు సంబంధించి నాగార్జునకు స్టోరీలైన్ వినిపించాడట శ్రీనువైట్ల. వెంటనే నాగ్ ఒప్పుకోవడంతో ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. పూర్తిస్థాయిలో కథ సిద్ధమైన తర్వాత ఈ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో వైట్ల-నాగ్ కాంబోలో కింగ్ సినిమా వచ్చింది. అందుకే ఇప్పుడు అఖిల్ రెండో మూవీని వైట్లకు అప్పగించే ఆలోచనలో ఉన్నాడట నాగార్జున. బడ్జెట్ లెక్కలన్నీ కుదిరితే అఖిల్ రెండో సినిమా కూడా అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైనే వచ్చే అవకాశముంది.

First Published:  12 Oct 2015 7:03 PM GMT
Next Story