Telugu Global
National

బీహార్ బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్!

బీహార్ ఎన్నికల సంగ్రామంలో సీఎం అభ్యర్థి లేకుండానే బరిలోకి దిగిన బీజేపీ తొలివిడత ఎన్నికలు ముగిసిన వెంటనే అభ్యర్థిని ప్రకటించింది. బీహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సీఎంగా డాక్టర్ ప్రేమ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని బీజేపీ ప్రచారకర్త కేంద్రమంత్రి షానవాజ్ హుస్సేన్ ఈ విషయాన్ని వెల్లడించారు.  ప్రేమ్ కుమార్ బీహార్ గయ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గయ నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దీనికిత తోడు […]

బీహార్ బీజేపీ సీఎం అభ్యర్థి ప్రేమ్ కుమార్!
X
బీహార్ ఎన్నికల సంగ్రామంలో సీఎం అభ్యర్థి లేకుండానే బరిలోకి దిగిన బీజేపీ తొలివిడత ఎన్నికలు ముగిసిన వెంటనే అభ్యర్థిని ప్రకటించింది. బీహార్ లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సీఎంగా డాక్టర్ ప్రేమ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని బీజేపీ ప్రచారకర్త కేంద్రమంత్రి షానవాజ్ హుస్సేన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రేమ్ కుమార్ బీహార్ గయ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గయ నుంచి ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దీనికిత తోడు ప్రేమ్ కుమార్ కు బీహార్ లో వెనుకబడి వర్గాలకు చెందిన నాయకుడిగా గుర్తింపు ఉంది. ప్రేమ్ కుమార్ ను గెలిపిస్తే ఎన్డీఏ సీఎం అభ్యర్థి అవుతారని షా నవాజ్ హుస్సేన్ గయ ప్రచార సభలో ప్రకటించారు. అయితే మరో సీనియర్ నేత ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సుశీల్ కుమార్ మోడీ కూడా సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. అయితే ప్రేమ్ కుమార్ నే సీఎం అభ్యర్థి సోషల్ నెట్ వర్క్ సైట్లలో మద్దతు పెరుగుతోంది.
First Published:  12 Oct 2015 8:32 AM GMT
Next Story