Telugu Global
Cinema & Entertainment

నాపై బయోపిక్ ఒక పెద్ద ఫ్లాప్!

‘నా జీవితచరిత్ర ఒక పెద్ద ఫ్లాప్’ అని స్వయంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనడం ఆశ్చర్యం కలిగించ వచ్చు. కాని తన 73వ పుట్టిన రోజు సందర్భంగా అమితాబ్ స్టేటెమెంట్ ఇలా ఉంది మరి. కారణం ఏమిటి? ‘అసలు నా పైన సినిమా అనేది చేయడం నాకు ఇష్టం లేదు. కనుక అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అనేది నేను చెప్పలేను,’ అని బియోపిక్స్‌పై తన అయిష్టత వ్యక్తం చేసారు మెగాస్టార్. తను బయోపిక్స్ మెటీరియల్ […]

నాపై బయోపిక్ ఒక పెద్ద ఫ్లాప్!
X

‘నా జీవితచరిత్ర ఒక పెద్ద ఫ్లాప్’ అని స్వయంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అనడం ఆశ్చర్యం కలిగించ వచ్చు. కాని తన 73వ పుట్టిన రోజు సందర్భంగా అమితాబ్ స్టేటెమెంట్ ఇలా ఉంది మరి. కారణం ఏమిటి? ‘అసలు నా పైన సినిమా అనేది చేయడం నాకు ఇష్టం లేదు. కనుక అందులో ఎవరు నటిస్తే బాగుంటుంది అనేది నేను చెప్పలేను,’ అని బియోపిక్స్‌పై తన అయిష్టత వ్యక్తం చేసారు మెగాస్టార్.
తను బయోపిక్స్ మెటీరియల్ కాదని అమితాబ్ అభిప్రాయం. ప్రస్తుతం బాలివుడ్‌లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ముంబై ఎటాక్స్ కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న సూపర్‌స్టార్ సంజయ్ దత్‌పై ఆల్రెడీ బయోపిక్ కోసం రంగం సిద్ధం చేస్తునారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. అందుకే అమితాబ్ బచ్చన్‌పై బయోపిక్ కోసం అభిమానులు ఎదురు చూడడం సబబే.
మెగాస్టార్‌పై బయోపిక్ తీస్తే నిజంగా ఫ్లాప్ అవుతుందా? కాని అమితాబ్ స్టయిల్ తెరపై ఇమిటేట్ చేయడం ఎవరితరం! సౌత్‌లో ఒక రజినీకాంత్, నార్త్‌లో ఒక అమితాబ్ వీరి స్టయిల్ ఎవరికీ రాదు. ఇద్దరూ సాంప్రదాయ హీరోకు ఉండవలసిన ప్యారామీటర్స్‌ని తీసిరాజని విజేతలుగా నిలిచినవారే. ట్రూ లెజెండ్స్! ఏమంటారు?

First Published:  11 Oct 2015 7:02 PM GMT
Next Story