Telugu Global
Cinema & Entertainment

అంచనాలు పెంచుతున్న  క‌ళ్యాణ్ రామ్ షేర్ ట్రైల‌ర్ 

ఎంతో కాలంగా మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేసిన  క‌ళ్యాణ్ రామ్ కు చివ‌ర‌కు   ప‌టాస్ చిత్రంతో ఘ‌న విజ‌యం అందుకున్నాడు. ఆ త‌రువాత  కిక్ 2 సినిమాను  నిర్మించారు. ఇది నిరాశ ప‌రిచంది. తాజాగా త‌ను  హీరోగా షేర్ చిత్రంతో అభిమానుల ముంద‌కు వ‌స్తున్నాడు.  ఈ చిత్రం ఆడియో విడుద‌ల జ‌రిగింది. ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఉంది. ఇక చిత్రం కాన్సెప్టు గురించి కళ్యాణ్ రామ్ చెప్తూ… సింహం అస్తమానం […]

అంచనాలు పెంచుతున్న  క‌ళ్యాణ్ రామ్ షేర్ ట్రైల‌ర్ 
X

ఎంతో కాలంగా మంచి స‌క్సెస్ కోసం వెయిట్ చేసిన క‌ళ్యాణ్ రామ్ కు చివ‌ర‌కు ప‌టాస్ చిత్రంతో ఘ‌న విజ‌యం అందుకున్నాడు. ఆ త‌రువాత కిక్ 2 సినిమాను నిర్మించారు. ఇది నిరాశ ప‌రిచంది. తాజాగా త‌ను హీరోగా షేర్ చిత్రంతో అభిమానుల ముంద‌కు వ‌స్తున్నాడు. ఈ చిత్రం ఆడియో విడుద‌ల జ‌రిగింది. ఈ చిత్రం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ టైటిల్ కు త‌గ్గ‌ట్లే ఉంది.
ఇక చిత్రం కాన్సెప్టు గురించి కళ్యాణ్ రామ్ చెప్తూ… సింహం అస్తమానం వేటాడదు. కానీ వేటకి దిగిందంటే మాత్రం ఇక తిరుగుండదు. ఇక్కడ కూడా ఓ కుర్రాడు అప్పటిదాకా ఆడుతూ పాడుతూ సరదాగా కనిపించాడు. కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం సింహంలా విజృంభించాడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు నందమూరి కల్యాణ్‌రామ్‌. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్దం అవుతున్న ఈచిత్రం పై క‌ళ్యాణ్ రామ్ అభిమానులు కొద్ది పాటి అంచ‌నాల‌తో వున్నారు.

First Published:  10 Oct 2015 7:11 PM GMT
Next Story