Telugu Global
Cinema & Entertainment

చరణ్ 'కొనిదెల మూవీస్' చిన్న సినిమాకు నో

మెగాఫ్యామిలీ ఆధీనంలో పలు చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’, అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’ వంటి సంస్థల గురించి మనకు తెలిసినదే. ఇక ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ కూడా ప్రొడక్షన్ రంగంలోకి దిగుతున్నాడు. ఒక్కటి కాదు.. రెండు ప్రొడక్షన్ సంస్థలను ఆవిష్కరించబోతున్నాడు మన మెగ్గా హీరో రామ్ చరణ్. అందులో ఒకటి ‘కొనిదెల మూవీస్’. ఈ సంస్థ ద్వారా, కేవలం పెద్ద సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారట. చిన్న సినిమాల […]

చరణ్ కొనిదెల మూవీస్ చిన్న సినిమాకు నో
X

మెగాఫ్యామిలీ ఆధీనంలో పలు చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. నాగబాబు ‘అంజనా ప్రొడక్షన్స్’, అల్లు అరవింద్ ‘గీతా ఆర్ట్స్’ వంటి సంస్థల గురించి మనకు తెలిసినదే. ఇక ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ కూడా ప్రొడక్షన్ రంగంలోకి దిగుతున్నాడు. ఒక్కటి కాదు.. రెండు ప్రొడక్షన్ సంస్థలను ఆవిష్కరించబోతున్నాడు మన మెగ్గా హీరో రామ్ చరణ్.
అందులో ఒకటి ‘కొనిదెల మూవీస్’. ఈ సంస్థ ద్వారా, కేవలం పెద్ద సినిమాలను మాత్రమే ప్రొడ్యూస్ చేస్తారట. చిన్న సినిమాల ఊసు ఈ సంస్థ అసలు తలపెట్టనే పెట్టదట. కాని ఇంకో బ్యానర్ కూడా రామ్ చరణ్ పెట్టబోతున్నడు.. అది వైట్ హార్సెస్ ప్రొడక్షన్ బ్యానర్’. ఈ బ్యానర్ ద్వారా చిన్న సినిమాలను ప్రోత్సహించబోతున్నారు.
రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రాన్ని తన బ్యానర్‌లోనే నిర్మిస్తానని అనేకసార్లు చెప్పారు. ఆ ప్రొడక్షన్ బ్యానర్ గురించి వివరాలు ఇప్పుడు రివీల్ చేసారు. తెలుగు హీరోలు ఒకరొకరుగా నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్ ఆల్‌రెడీ ఒక హిట్ కూడా కొట్టాడు ‘శ్రీమంతుడు’తో తన స్వంత బ్యానర్ కింద. మరి రామ్ చరణ్ మొదటి సినిమా కోసం వేచి చూద్దాం.

Next Story