Telugu Global
Cinema & Entertainment

నాగశౌర్య పెద్ద మనస్సు

చిన్న పిల్లాడే ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇంకా చిన్న హీరోనే .. కాని యంగ్ హీరో నాగాశౌర్య మనస్సు మాత్రం చాలా పెద్దది అని నిరూపించుకున్నాడు. శుక్రవారం ఈ హీరో విజయనగరానికి వెళ్ళి అక్కడ ఒక దివంగత సైనికుడి ఇల్లాలికి యాభై వేల రూపాయలు సహాయం అందించాడు. కీ.శే. బి.సత్యం ఇటీవల జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ తీవ్రవాదులతో జరిగిన గన్ బ్యాటిల్‌లో అసువులు బాసాడు. ఆ కుటుంబానికి సహాయం చేయాలనే గొప్ప మనస్సుతో, తన […]

నాగశౌర్య పెద్ద మనస్సు
X

చిన్న పిల్లాడే ఇంకా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఇంకా చిన్న హీరోనే .. కాని యంగ్ హీరో నాగాశౌర్య మనస్సు మాత్రం చాలా పెద్దది అని నిరూపించుకున్నాడు. శుక్రవారం ఈ హీరో విజయనగరానికి వెళ్ళి అక్కడ ఒక దివంగత సైనికుడి ఇల్లాలికి యాభై వేల రూపాయలు సహాయం అందించాడు. కీ.శే. బి.సత్యం ఇటీవల జమ్ము కాశ్మీర్‌లో పాకిస్తాన్ తీవ్రవాదులతో జరిగిన గన్ బ్యాటిల్‌లో అసువులు బాసాడు. ఆ కుటుంబానికి సహాయం చేయాలనే గొప్ప మనస్సుతో, తన తండ్రి ఇన్స్‌పిరేషన్‌తో ఆ సైనికుని భార్యా పిల్లలను కలుసుకున్నాడు.
ఇక తన సినిమాల విషయానికి వస్తే, ‘కల్యాణ వైభోగమే ‘ మరియు ‘అమ్మాయితో అబ్బాయి ‘ అనే రొమాంటిక్ డ్రామాలతో పాటు, మెగాహీరోయిన్ నీహారిక డెబ్యూ మూవీ సైతం త్వరలో చేయనున్నాడు. యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు నాగశౌర్య, ముఖ్యంగా అమ్మాయిలలో క్రేజ్ ఉన్న హీరో ప్రస్తుతం. ఇప్పుడు ఇలాంటి మంచి పని చేయడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలవడమే కాకుండా, ఒక మంచి ఇమేజ్ అతనికి వరంగా మారుతుందనే చెప్పవచ్చు. ఏమంటారు?

First Published:  10 Oct 2015 9:09 PM GMT
Next Story