Telugu Global
Cinema & Entertainment

10 కోట్ల కొల‌వెర్రి!

మూడేళ్ల క్రితం భార‌తీయుల చెవులు హోరెత్తిలా, యువ‌త వెర్రెత్తేలా చేసిన పాట వై దిస్ కొల‌వ‌రెడీ.! దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించిన ఈ పాట 2012లో ధనుష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘త్రీ’ లోనిది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, హీరో ధ‌నుష్ స్వ‌యంగా ఈ పాట‌ను పాడ‌టం విశేషం. బ‌ట్ల‌ర్‌ ఇంగ్లిష్‌తో ఉన్న ఈ విర‌హ‌గీతం క్లాస్‌, మాస్ తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చింది. అందుకే ప్రేక్ష‌కులు యూట్యూబ్‌లో ఇప్ప‌టికీ […]

10 కోట్ల కొల‌వెర్రి!
X

మూడేళ్ల క్రితం భార‌తీయుల చెవులు హోరెత్తిలా, యువ‌త వెర్రెత్తేలా చేసిన పాట వై దిస్ కొల‌వ‌రెడీ.! దేశంలోనే సంచ‌ల‌నం సృష్టించిన ఈ పాట 2012లో ధనుష్‌, శ్రుతి హాసన్‌ జంటగా నటించిన తమిళ చిత్రం ‘త్రీ’ లోనిది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, హీరో ధ‌నుష్ స్వ‌యంగా ఈ పాట‌ను పాడ‌టం విశేషం. బ‌ట్ల‌ర్‌ ఇంగ్లిష్‌తో ఉన్న ఈ విర‌హ‌గీతం క్లాస్‌, మాస్ తేడా లేకుండా అంద‌రికీ న‌చ్చింది. అందుకే ప్రేక్ష‌కులు యూట్యూబ్‌లో ఇప్ప‌టికీ చూస్తూనే ఉన్నారు. కొల‌వ‌రి కేవ‌లం భార‌తీయుల‌నే కాదు, ప్ర‌పంచంలోని వివిధ దేశాల్లో ఉన్న వారిని సైతం ఇప్ప‌టికీ క‌ట్టిప‌డేస్తుంది. ప్ర‌స్తుతం ఈపాట‌ను 9,82,00,000 మంది వీక్షించారు. త్వ‌ర‌లోనే 10 కోట్ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో దేశంలో గంగ్‌న‌మ్ డాన్స్ పాట త‌రువాత అంత‌గా ప్రాచుర్యం పొందిన పాట ఇదే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. సంగీతానికి భాషా, ప్రాంతం భేదం ఉండ‌దు. న‌చ్చితే ఈ ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఆద‌రిస్తారు. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మాని ఇంట‌ర్నెట్‌, సామాజిక మాధ్య‌మాలు భూమిపై ప్ర‌తి మాన‌వుడికి అందుబాటులోకి వ‌చ్చాయి. దాంతో ప్ర‌తి నెటిజ‌న్ త‌మ‌కు న‌చ్చిన విష‌యాల‌ను, పాట‌ల‌ను వెంట‌నే షేర్ చేస్తూ.. న‌లుగురితో పంచుకుంటున్నాడు. అది నెట్‌లో వైర‌ల్ విస్త‌రిస్తూ.. ప్ర‌తి మాన‌వునికి చేరుతుంది. కొల‌వ‌రి విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది.


https://www.youtube.com/watch?v=YR12Z8f1Dh8

First Published:  10 Oct 2015 6:43 PM GMT
Next Story