Telugu Global
Cinema & Entertainment

రూమర్స్ పై ఎన్టీఆర్  క్లారిఫికేష‌న్‌

ఎన్టీఆర్ ఆ మధ్యన ‘కిక్-2’ చిత్రం విడుదల కోసం ఆరు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారని, అందుకోసం దిల్ రాజు కు సైన్ చేసారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎన్టీఆర్ క్లారిఫికేషన్ ఇస్తూ షేర్ ఆడియో పంక్షన్ లో మాట్లాడారు. అటువంటిదేమీ లేదని అదంతా కేవలం మీడియా సృష్టే అని ఎన్టీఆర్ తేల్చేసారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ-” ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని అందరినీ చూసి వెళిపోదామని, నాలుగు […]

రూమర్స్ పై ఎన్టీఆర్  క్లారిఫికేష‌న్‌
X

ఎన్టీఆర్ ఆ మధ్యన ‘కిక్-2’ చిత్రం విడుదల కోసం ఆరు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారని, అందుకోసం దిల్ రాజు కు సైన్ చేసారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎన్టీఆర్ క్లారిఫికేషన్ ఇస్తూ షేర్ ఆడియో పంక్షన్ లో మాట్లాడారు. అటువంటిదేమీ లేదని అదంతా కేవలం మీడియా సృష్టే అని ఎన్టీఆర్ తేల్చేసారు. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ-” ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని అందరినీ చూసి వెళిపోదామని, నాలుగు రోజులు ఇంట్లోవాళ్లతో సరదాగా గడుపుదామని లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను. అయితే నేనేదో ‘కిక్‌ 2’ఆర్థిక సమస్యల్లో ఉందని… అందుకే నేనేదో సంతకాలు పెట్టడానికి వచ్చానని కొంతమంది రాశారు. వాళ్లను నేనేం తప్పు పట్టడం లేదు. కల్యాణ్‌రామ్ అన్నయ్యది ఒకరికి పెట్టే చేయే కానీ తీసుకునే చేయి కాదు. అంత మంచి వ్యక్తి ఆయన. ” అని చెప్పుకొచ్చారు.సో .. కిక్ 2 స‌మ‌యంలో ఎన్టీఆర్ ఏదో ఫైనాన్షియ‌ల్ స‌పోర్ట్ ఇచ్చార‌నే రూమ‌ర్ నిజం కాద‌న్న‌మాట‌.

First Published:  10 Oct 2015 7:12 PM GMT
Next Story