Telugu Global
Cinema & Entertainment

ద‌స‌ర పండ‌గ‌  బ్లాక్ బ‌స్ట‌ర్  ఏది..?

తెలుగు నాట  సంక్రాంతి పండగ అంటే కొత్త  సినిమాల పండ‌గే.  కొత్త అల్లుళ్ల‌తో పాటు.. కొత్త సినిమాలు  చూపించ‌డానికి నిర్మాత‌లు పోటి ప‌డ‌తారు.  జ‌న‌రల్ గా పెద్ద బ‌డ్జెట్ చిత్రాల‌న్నీ సంక్రాంతి  పండ‌గ‌కు సంద‌డి చేయ‌డానికి   సిద్దం అవుతుంటాయి. అయితే  ద‌స‌ర పండ‌గ  కొత్త సినిమాల‌కు  అంత  ఇది కాదు. కానీ. ఈ సారి  విజ‌య ద‌శ‌మికి  చెప్పుకొ ద‌గ్గ చిత్రాలే  వ‌స్తున్నాయి.  అల్రేడి  రాణిరుద్ర‌మ్మ అభిమానుల‌కు ముందుకు వ‌చ్చేసింది.   చారిత్రిక డ్రామ గా వ‌చ్చిన ఈ […]

ద‌స‌ర పండ‌గ‌  బ్లాక్ బ‌స్ట‌ర్  ఏది..?
X

తెలుగు నాట సంక్రాంతి పండగ అంటే కొత్త సినిమాల పండ‌గే. కొత్త అల్లుళ్ల‌తో పాటు.. కొత్త సినిమాలు చూపించ‌డానికి నిర్మాత‌లు పోటి ప‌డ‌తారు. జ‌న‌రల్ గా పెద్ద బ‌డ్జెట్ చిత్రాల‌న్నీ సంక్రాంతి పండ‌గ‌కు సంద‌డి చేయ‌డానికి సిద్దం అవుతుంటాయి. అయితే ద‌స‌ర పండ‌గ కొత్త సినిమాల‌కు అంత ఇది కాదు. కానీ. ఈ సారి విజ‌య ద‌శ‌మికి చెప్పుకొ ద‌గ్గ చిత్రాలే వ‌స్తున్నాయి. అల్రేడి రాణిరుద్ర‌మ్మ అభిమానుల‌కు ముందుకు వ‌చ్చేసింది. చారిత్రిక డ్రామ గా వ‌చ్చిన ఈ చిత్రం అంద‌ర్నీ అల‌రిస్తుంది. కాక‌తీయుల వీర‌నారి ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ ఎంతో ప్యాష‌న్ తో తెర‌కెక్కించి అభిమానుల మ‌న‌సు చూర‌గొన్నాడు. ఢిప‌రెంట్ షేడ్స్ వున్న రాణిరుద్ర‌మ రోల్ ను అనుష్క త‌న భ‌జ స్కందాల‌పై మోసేసింది.
ఇక పండ‌గ ముందు రాంచ‌ర‌ణ్ న‌టించిన బ్రుస్ లీ చిత్రం తో పాటు.. నాగార్జున త‌న‌యుడు అఖిల్ డెబ్యూగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం కూడా అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్దం అవుతున్నాయి.
రాంచ‌ర‌ణ్ న‌టిస్తున్న బ్రుస్ లీ కుటుంబం, యాక్ష‌న్ ఎలిమెంట్స్ మేళ‌వింపు గా వ‌స్తుండ‌గా.. అఖిల్ న‌టించిన సినిమా సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ తో వ‌స్తుంద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ మూడు చిత్రాల్లో రాణిరుద్ర‌మ ఇప్ప‌టికే అభిమానుల మ‌నుసు గెలిచింది. మ‌రి రాంచ‌ర‌ణ్, అఖిల్ లో ఎవ‌రు మెప్పిస్తారో..ఎవ‌రు ఈ ద‌స‌ర పండ‌గ హిట్ హీరోగా అభిమానుల మ‌న‌సు దోచుకుంటారో లెట్స్ వెయింట్ అండ్ సీ.

Next Story