Telugu Global
Cinema & Entertainment

జ‌క్క‌న పుట్టి అప్పుడే నాలుగు ప‌దులు దాటిందా..!

అప‌జ‌యం లేకుండా  సినిమాలు చేయాలంటే  రాజ‌మౌళినే  సంప్ర‌దించాలి. ఇప్ప‌టి వ‌ర‌కు   అప‌జ‌యం ఎర‌గ‌ని రాజ‌మౌళి  బాహుబ‌లి చిత్రంతో అంత‌ర్జాతీయ ఖ్యాతిని  ఆర్జించాడు. మనోడు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా విజయం వెతుక్కుంటూ మరీ వస్తోంది. స్టార్ హీరోలను పెట్టి సినిమా తీసినా, స్టార్ ఇమేజ్ లేని వాళ్లతో చేసినా..అసలు హీరో లేకుండా ఈగల్ని పెట్టి తీసినా హిట్టవుతోంది. మరి ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన విషయం ఉంది కాబట్టే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగి పోయారు. ఈ […]

జ‌క్క‌న పుట్టి అప్పుడే నాలుగు ప‌దులు దాటిందా..!
X

అప‌జ‌యం లేకుండా సినిమాలు చేయాలంటే రాజ‌మౌళినే సంప్ర‌దించాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అప‌జ‌యం ఎర‌గ‌ని రాజ‌మౌళి బాహుబ‌లి చిత్రంతో అంత‌ర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాడు. మనోడు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా విజయం వెతుక్కుంటూ మరీ వస్తోంది. స్టార్ హీరోలను పెట్టి సినిమా తీసినా, స్టార్ ఇమేజ్ లేని వాళ్లతో చేసినా..అసలు హీరో లేకుండా ఈగల్ని పెట్టి తీసినా హిట్టవుతోంది. మరి ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు కావాల్సిన విషయం ఉంది కాబట్టే ఆయన అందనంత ఎత్తుకు ఎదిగి పోయారు. ఈ రోజు రాజమౌళి పుట్టినరోజు. అక్టోబర్ 10, 1973లో జన్మించిన రాజమౌళి నేటితో 41 వసంతాలు పూర్తి చేసుకుని 42వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా తెలుగు గ్లోబ‌ల్ తరుపున రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.

First Published:  9 Oct 2015 7:07 PM GMT
Next Story