దళిత మహిళను బట్టలూడదీసి కొట్టిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా దగ్గర దన్‌కౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే అతను ఇంట్లో దొంగతనం జరిగింది. దానిపై ఫిర్యాదు చేయడానికి సునీల్ గౌతమ్, అతని భార్య, పిల్లవాడు మరికొంతమంది బంధువులు కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళారు. కాని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడానికి ఒప్పుకోలేదు. దాంతో ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదుచేయరని సునీల్ భార్య పోలీసులను ప్రశ్నించింది. ఒక దళిత మహిళ తనను ప్రశ్నించినందుకు మండిపడ్డ పోలీసు ఆఫీసర్, స్టేషన్‌లోని పోలీసులు వాళ్ళమీద దాడి చేసి చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక […]
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా దగ్గర దన్‌కౌర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సునీల్ గౌతమ్ అనే అతను ఇంట్లో దొంగతనం జరిగింది. దానిపై ఫిర్యాదు చేయడానికి సునీల్ గౌతమ్, అతని భార్య, పిల్లవాడు మరికొంతమంది బంధువులు కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళారు. కాని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేయడానికి ఒప్పుకోలేదు. దాంతో ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదుచేయరని సునీల్ భార్య పోలీసులను ప్రశ్నించింది. ఒక దళిత మహిళ తనను ప్రశ్నించినందుకు మండిపడ్డ పోలీసు ఆఫీసర్, స్టేషన్‌లోని పోలీసులు వాళ్ళమీద దాడి చేసి చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక బయటకి పరిగెత్తిన సునీల్, అతని భార్యను పట్టుకుని బూతులు తిడుతూ నడిరోడ్డుమీద బట్టలూడదీసి కొట్టి అంతటితో ఊరుకోకుండా సునీల్ మీద, అతని భార్యమీద, బంధువులమీద కేసు నమోదుచేసారు. పోలీసులమీద దాడిచేసారన్న నేరంపై జైలుకు పంపారు. ఈ తతంగానంతా రహస్యంగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ఒక వ్యక్తి దానిని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు ప్రభుత్వం పోలీసులను కాపాడుకొనే ప్రయత్నంలో పడింది.