Telugu Global
Cinema & Entertainment

ఇదంతా తెలుగు వాళ్ళ కోసమే చేసాను: కమల్

తెలుగు వాళ్ళ కోసం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిజంగా ఏం చేసాడు అంతగా? కార్ల నంబర్ ప్లేట్ మార్చాడు. పోలీసుల యూనిఫార్మ్ కూడా మార్చాడు, నేమ్ ప్లేట్స్ కూడా మార్చాడు. ఇందులో అంత గొప్పదనం ఏముంది? కమల్ హాసన్ ఇదంతా చెప్పాడంటే ఇందులో ఏదో మర్మం ఉందనే కదా అర్థం. లోకనాయకుడు కమల్ హాసన్ రాబోయే సినిమా ‘చీకటి రాజ్యం’ సినిమా బైలింగ్వల్… తెలుగు మరియు తమిళంలో తీస్తున్నారు. కమల్ హాసన్ తమిళుడు కనుక తమిళ్‌కి […]

ఇదంతా తెలుగు వాళ్ళ కోసమే చేసాను: కమల్
X

తెలుగు వాళ్ళ కోసం యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నిజంగా ఏం చేసాడు అంతగా? కార్ల నంబర్ ప్లేట్ మార్చాడు. పోలీసుల యూనిఫార్మ్ కూడా మార్చాడు, నేమ్ ప్లేట్స్ కూడా మార్చాడు. ఇందులో అంత గొప్పదనం ఏముంది? కమల్ హాసన్ ఇదంతా చెప్పాడంటే ఇందులో ఏదో మర్మం ఉందనే కదా అర్థం. లోకనాయకుడు కమల్ హాసన్ రాబోయే సినిమా ‘చీకటి రాజ్యం’ సినిమా బైలింగ్వల్… తెలుగు మరియు తమిళంలో తీస్తున్నారు. కమల్ హాసన్ తమిళుడు కనుక తమిళ్‌కి ప్రాముఖ్యత ఉండడం సహజం అనుకుంటాం. కాని అదేమీ లేదని అంటున్నాడు యూనివర్సల్ స్టార్.
తెలుగు వెర్షన్ అంటే ఎదో లిప్ సింక్ కాకుండా, ప్రతీ షాట్ రాజీ పడకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు తీసారు. ఒక కార్ సీన్ ఉందనుకోండి.. తమిళ వెర్షన్ కోసం తీసిన షాట్‌నే తెలుగు కోసం ఉంచేయకుండా, మల్లీ నేమ్ ప్లేట్ మార్చి తీసారట. తమిళ పొలీసుల యూనిఫారం వేరుగా ఉంటుంది కనుక, తెలుగు పొలీసుల యూనిఫారం కనిపించే సీన్స్‌లో జాగ్రత్త తీసుకున్నారట. వివిధ సన్నివేశాలలో కనిపించే నేం బోర్డ్స్ సైతం తెలుగులో ఉండే విధంగా చూసుకున్నారట. ఇక లిప్ సింక్ మరియు డబ్బింగ్ విషయం అసలు రాజీనే పడలేదట. అందుకే తమిళులకన్నా మిన్నగా, కమల్ హాసన్ తెలుగు హీరో అని తెలుగు వారు గర్వంగా చెప్పుకుంటారు మరి.

First Published:  9 Oct 2015 7:04 PM GMT
Next Story