అఖిల్ సూర్య కవచం..!
కొడితే సిక్స్ కొట్టాలి. ఆడితే రఫ్ ఆడాలి ప్రస్తుతం అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి చేస్తున్న ప్రచార ఎత్తుగడ. సాధారణంగ తమిళ్ హీరోలు తమ మొదటి సినిమా నుంటే.. తెలుగులో రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మన తెలుగు హీరోలు మాత్రం .. తెలుగు సర్కిల్ దాటి అవతలకు వెళ్లడం ఇష్టం లేనట్లుంటారు. ఒక్క బన్నీ మాత్రం మలయాళంలో తన చిత్రాల డబ్బింగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకో గలిగాడు. తమిళ నాట మొన్న బాహుబలి చిత్రంతో […]
కొడితే సిక్స్ కొట్టాలి. ఆడితే రఫ్ ఆడాలి ప్రస్తుతం అఖిల్ కొత్త సినిమాకు సంబంధించి చేస్తున్న ప్రచార ఎత్తుగడ. సాధారణంగ తమిళ్ హీరోలు తమ మొదటి సినిమా నుంటే.. తెలుగులో రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మన తెలుగు హీరోలు మాత్రం .. తెలుగు సర్కిల్ దాటి అవతలకు వెళ్లడం ఇష్టం లేనట్లుంటారు. ఒక్క బన్నీ మాత్రం మలయాళంలో తన చిత్రాల డబ్బింగ్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకో గలిగాడు. తమిళ నాట మొన్న బాహుబలి చిత్రంతో ప్రభాస్ కు కొంత పాపులార్టీ వచ్చింది.
అయితే అక్కినేని అఖిల్ మాత్రం మొదటి సినిమాతోనే సౌత్ ఇండియన్ హీరో అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వివివినాయక్ డైరెక్షన్ లో హీరో నితిన్ నిర్మిస్తున్న అఖిల్ సినిమాను తమిళ్ లో సూర్య కవచం పేరు తో డబ్బ్ చేస్తున్నారు. ఈ సినిమాను దసర పండగను పురస్కరించుకొని రిలీజ్ చేయడానికి సన్నహాలు చేస్తున్నారు.
త్వరలో చెన్నైలో ‘సూర్య కవచం’ ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. రజనీకాంత్ ద్వారా అఖిల్ తమిళ ప్రేక్షకులకు పరిచయం అయితే తమిళ మార్కెట్లో అఖిల్ సినిమాకు మంచి బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు అఖిల్ సినిమా తమిళ రైట్స్ దక్కించుకున్నసి.కళ్యాణ్ రజనీకాంత్ ను ఆహ్వానించినట్లు సమాచారం.