Telugu Global
Cinema & Entertainment

 ముందు నేను.. తర్వాతే నువ్వు...

స్వయంగా హీరో రామ్ చరణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ముందు నేనుంటానని, నా తర్వాతే పవన్ ఉంటాడని ప్రకటించాడు చెర్రీ. అయితే ఇందులో అభిమానులు ఆశ్చర్యపోవడానికి, కోపం తెచ్చుకోవడానికి ఏం లేదు. స్టార్ డమ్ విషయంలో కాకుండా సినిమాల విషయంలో ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు చెర్రీ. పవన్ సినిమాలతో కంపేరిజన్ చేస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ముందు బ్రూస్ లీ వచ్చిన తర్వాతే సర్దార్ గబ్బర్ సింగ్ వస్తుందని కామెడీగా చెప్పుకొచ్చాడు. మరోవైపు తను […]

 ముందు నేను.. తర్వాతే నువ్వు...
X
స్వయంగా హీరో రామ్ చరణ్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. ముందు నేనుంటానని, నా తర్వాతే పవన్ ఉంటాడని ప్రకటించాడు చెర్రీ. అయితే ఇందులో అభిమానులు ఆశ్చర్యపోవడానికి, కోపం తెచ్చుకోవడానికి ఏం లేదు. స్టార్ డమ్ విషయంలో కాకుండా సినిమాల విషయంలో ఈ స్టేట్ మెంట్ ఇచ్చాడు చెర్రీ. పవన్ సినిమాలతో కంపేరిజన్ చేస్తూ అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ముందు బ్రూస్ లీ వచ్చిన తర్వాతే సర్దార్ గబ్బర్ సింగ్ వస్తుందని కామెడీగా చెప్పుకొచ్చాడు. మరోవైపు తను నిర్మాతగా పవన్ హీరోగా రాబోతున్న సినిమాపై కూడా ఇలానే స్పందించాడు. ముందు తన సినిమా పనులు పూర్తవ్వాలని, తర్వాతే పవన్ సినిమా గురించి ఆలోచిస్తానన్నాడు. మరోవైపు పవన్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఆ సినిమా కూడా కంప్లీట్ అయిన తర్వాత తన ప్రొడక్షన్ లో పవన్ సినిమా గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చాడు చెర్రీ.
First Published:  8 Oct 2015 7:03 PM GMT
Next Story