Telugu Global
CRIME

ఏడుగురిని కన్నందుకు రూ. 71 లక్షలుపైగా జరిమానా!

కుటుంబ నియంత్రణ విధానాన్ని ఉల్లంఘించి ఏడుగురు పిలల్ని కన్నందుకు ఓ కుటుంబానికి చైనా ప్రభుత్వం భారీ మొత్తంలో 1,10,180 డాలర్లు (రూ. 71.35 లక్షలు) జరిమానా విధించింది. బీజింగ్ లోని టాంగ్ ఝౌ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గురు కొడుకులు,  నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబంపై స్థానిక జనాభా, కుటుంబ నియంత్రణ కమిషన్ ఏడు లక్షల యువాన్ల జరిమానా విధించింది. ఇటీవల ఈ విధానం అమలును సరళతరం చేసినప్పటికీ ఏడుగురు పిల్లలను కనడంపై ‘హుకావ్‌’ను నిరాకరించింది. […]

కుటుంబ నియంత్రణ విధానాన్ని ఉల్లంఘించి ఏడుగురు పిలల్ని కన్నందుకు ఓ కుటుంబానికి చైనా ప్రభుత్వం భారీ మొత్తంలో 1,10,180 డాలర్లు (రూ. 71.35 లక్షలు) జరిమానా విధించింది. బీజింగ్ లోని టాంగ్ ఝౌ జిల్లాకు చెందిన దంపతులకు ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్లు ఉన్నారు. ఈ కుటుంబంపై స్థానిక జనాభా, కుటుంబ నియంత్రణ కమిషన్ ఏడు లక్షల యువాన్ల జరిమానా విధించింది. ఇటీవల ఈ విధానం అమలును సరళతరం చేసినప్పటికీ ఏడుగురు పిల్లలను కనడంపై ‘హుకావ్‌’ను నిరాకరించింది. ‘హుకావ్’ అనుమతి ఉంటేనే చైనా పౌరులకు ప్రభుత్వం నుంచి ఉచిత విద్య, ఆరోగ్యరక్షణ, ఇతర సామాజిక సంక్షేమ ఫలాలు అందుతాయి. ఇవి లభించక పోవడంతోపాటు అదనంగా మరో71 లక్షలకు పైగా జరిమానా పడడం ఆ కుటుంబాన్ని ఆందోళనకు గురి చేస్తోంది.
First Published:  8 Oct 2015 3:08 PM GMT
Next Story