Telugu Global
Others

wonder world 50

రోజుకు 25 లీటర్ల నీరు తాగాల్సిందే! మద్యానికి బానిసలను, డ్రగ్స్‌లకు బానిసలను చూశాంగానీ ఇదేమిటి విచిత్రంగా నీళ్లకు బానిసేమిటి అనుకుంటున్నారా..? నిజమే.. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్‌కి చెందిన సాషా కెన్నెడీ అనే మహిళ వాటర్‌ ఎడిక్షన్‌ జబ్బుతో బాధపడుతోంది. ఈ జబ్బును ఎలా తగ్గించాలో అర్ధం కాక వైద్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 26 ఏళ్ల సాషాకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలున్నారు. మనం రోజుకు కనీసం 8 లీటర్ల నీళ్లయినా తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. కానీ […]

wonder world 50
X

రోజుకు 25 లీటర్ల నీరు తాగాల్సిందే!

మద్యానికి బానిసలను, డ్రగ్స్‌లకు బానిసలను చూశాంగానీ ఇదేమిటి విచిత్రంగా నీళ్లకు బానిసేమిటి అనుకుంటున్నారా..? నిజమే.. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్‌కి చెందిన సాషా కెన్నెడీ అనే మహిళ వాటర్‌ ఎడిక్షన్‌ జబ్బుతో బాధపడుతోంది. ఈ జబ్బును ఎలా తగ్గించాలో అర్ధం కాక వైద్యులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. 26 ఏళ్ల సాషాకు పెళ్లయింది.. ఇద్దరు పిల్లలున్నారు. మనం రోజుకు కనీసం 8 లీటర్ల నీళ్లయినా తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని వైద్యులు చెబుతుంటారు. కానీ చాలా మంది ఐదు లీటర్లకు మించి తాగరు. తాగలేరు… కానీ సాషా మాత్రం రోజుకు కనీసం 25 లీటర్ల నీరు తాగనిదే బతకలేదు. ఆమె నీరు లేకుండా కనీసం గంటసేపు కూడా ఉండలేదట.

రాత్రిపూట కూడా అంతే. గంటగంటకు నీరు పడాల్సిందే. అందుకే ఆమె ఎక్కడికెళ్లినా వెంట నీళ్లబాటిళ్లు తప్పనిసరి. అన్ని నీళ్లు తాగడమంటే మాటలా..! రోజులో బాత్రూంలోనే ఎక్కువసేపు ఉండాల్సి ఉంటుందేమో అన్న సందేహం కలగడం సహజం అది నిజమే. ఆమె రోజుకు 40 సార్లు బాత్రూం తలుపు తట్టాల్సిందే. సాషాకు ఈ అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది. స్కూలులో ఆమె స్నేహితులు ఆడుకుంటుంటే ఆమె మాత్రం నీళ్ల ఫౌంటెన్‌ దగ్గరే గడిపేదట. మరీ చిన్న వయసులో గమనించలేదు గానీ సాషాకు 13 ఏళ్లు వచ్చే సరికి రోజుకు 15 లీటర్ల నీరు తాగుతున్నట్లు ఆమె తల్లిదండ్రులు గుర్తించారు. 16 ఏళ్లకు స్కూలు చదువు అయిపోగానే సాషా ఓ చెప్పుల కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఆమె నీళ్ల అవసరాన్ని గుర్తించిన తోటి ఉద్యోగులు నీళ్ల కంటెయినర్లను ఆమె సీటు పక్కనే ఉంచేవారు. 20 ఏళ్ల వయసు వచ్చేసరికి సాషా రోజుకు 20 లీటర్ల నీరు తాగుతున్నది. తర్వాత చెప్పుల కంపెనీలో ఉద్యోగం మానేసిన సాషా ఓ టెలికం కంపెనీకి ఇంటి వద్ద నుంచే పనిచేయడం ప్రారంభించింది. 2007లో రోజుకు 18 నుంచి 25 లీటర్ల నీరు తాగేది. మన భూమ్మీద ఎక్కువ నీరు తాగుతున్న మనిషి బహుశా సాషానే కావచ్చు. ”నోరు పొడిబారిపోయినట్లు అనిపించినప్పుడల్లా నీరు తాగుతుంటాను. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు తెలియడం లేదు” అంటున్నది సాషా. బాగా దాహంగా ఉంటుందని, అందుకే నీరు తాగుతుంటానని తనను విచిత్రంగా చూసే వాళ్లకు సాషా చెబుతుంటుంది. ఆమె రాత్రిపూట లేవకుండా నిద్ర పోవడం చాలా కష్టం. ఆమె నిద్రకు ఉపక్రమించాక ఎక్కువసేపు నిద్రపోయిన సమయం ఒక గంటా పదిహేను నిమిషాలు. అంతకు మించి ఎక్కువసేపు ఎపుడూ నిద్రపోలేదు. వెంటనే మెలకువ వచ్చేస్తుంది. నీరు తాగడం, బాత్రూమ్‌కి వెళ్లడం వంటివాటితోనే ఆమె రాత్రి గడచిపోతుంది.

First Published:  7 Oct 2015 1:04 PM GMT
Next Story