Telugu Global
Others

అర్జున్ క‌నిపిస్తే.. సినిమా హిట్టే!

స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ వేస్తే.. సినిమా హిట్టేన‌ని తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక టాక్ ఉంది. పైగా అర్జున్‌ ఉంటే.. తెలుగుతోపాటు.. మ‌ళ‌యాళం మార్కెట్ కూడా షేక్ అవుతుంది. ఎంత‌టి స్టార్ డ‌మ్ ఉన్నా.. న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌ను పోషించాల‌ని బ‌న్నీ మ‌న‌సులో బ‌లంగా అనుకుంటాడు. కానీ ఇమేజ్‌, ఫ్యాన్స్‌, క‌మర్షియ‌ల్ కోణాల్లో ఆలోచించి వాటి జోలికి వెళ్ల‌డం లేదు. కానీ, మెదడులో ఆ ఆలోచ‌న మాత్రం బ‌న్నీని ఇబ్బంది పెడుతూనే ఉంది. […]

అర్జున్ క‌నిపిస్తే.. సినిమా హిట్టే!
X

స్ట‌యిలిష్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ వేస్తే.. సినిమా హిట్టేన‌ని తెలుగు ఇండ‌స్ట్రీలో ఒక టాక్ ఉంది. పైగా అర్జున్‌ ఉంటే.. తెలుగుతోపాటు.. మ‌ళ‌యాళం మార్కెట్ కూడా షేక్ అవుతుంది. ఎంత‌టి స్టార్ డ‌మ్ ఉన్నా.. న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌ను పోషించాల‌ని బ‌న్నీ మ‌న‌సులో బ‌లంగా అనుకుంటాడు. కానీ ఇమేజ్‌, ఫ్యాన్స్‌, క‌మర్షియ‌ల్ కోణాల్లో ఆలోచించి వాటి జోలికి వెళ్ల‌డం లేదు. కానీ, మెదడులో ఆ ఆలోచ‌న మాత్రం బ‌న్నీని ఇబ్బంది పెడుతూనే ఉంది. అందుకే అక్టోబ‌రు 9న విడుద‌ల‌వనున్న రుద్ర‌మ‌దేవి సినిమాలో గోన గ‌న్నారెడ్డి పాత్ర‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు అర్జున్‌.

వైవిధ్యానికే పెద్ద‌పీట‌!
2010లో వ‌చ్చిన వేదం సినిమాలో కేబుల్ రాజుగా బ‌న్నీ న‌ట‌న విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ రోజుల్లో మ‌రో హీరోతో క‌లిసి తెర‌ను పంచుకున్న బ‌న్నీ చొర‌వ‌ను ఇండ‌స్ర్టీ పెద్ద‌లు అంతా అభినందించారు. 2013లో వ‌చ్చిన ఎవ‌డు సినిమాలో బ‌న్నీదే లీడ్ రోల్‌. క‌థంతా బ‌న్నీ వేసిన స‌త్య పాత్ర చుట్టే తిరుగుతుంది. కానీ, సినిమాలో మొద‌టి 10 నిమిషాలు త‌ప్పితే.. మ‌రెక్క‌డా రాంచ‌ర‌ణ్ క‌న‌బ‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ఈ సినిమాలో విజ‌యంలోనూ అర్జున్ పాత్ర కీల‌క‌పాత్ర పోషించింది. తాజాగా వ‌స్తున్న రుద్ర‌మ‌దేవి చిత్రంలో గోన గ‌న్నారెడ్డిగా కూడా అర్జున్ మెప్పిస్తాడ‌ని ట్రెయిల‌ర్స్ లో బ‌న్నీ చెప్పిన డైలాగులే చెబుతున్నాయి.

గ‌న్నారెడ్డిగా వ‌స్తున్నాడు..!
గోన్న గ‌న్నారెడ్డిగా వ‌స్తోన్న బ‌న్నీ.. ఈ పాత్ర కోసం బాగానే క‌స‌ర‌త్తులు చేసిన‌ట్లు క‌నిపిస్తున్నాడు. గుర్ర‌పుస్వారీ, పోరాటాలు, సంభాష‌ణ‌లు ప‌లికే తీరు, ఆహార్యం, వేష‌ధార‌ణ‌లో చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నాడు. కాక‌తీయ సామ్రాజ్యంలో రాబిన్‌హుడ్‌లాంటి మ‌న‌స్త‌త్వం, గంభీర‌మైన వ్య‌క్తిత్వం, శ‌త్రువుల‌ను చీల్చిచెండాడే తత్వంతో గ‌న్నారెడ్డి ఉండేవాడ‌ని చ‌రిత్ర చెబుతోంది. మ‌రి అంత‌టి పరాక్ర‌మ‌వంతుడి పాత్ర‌లో బ‌న్నీ ఎలా న‌టించాడో చూడాల‌ని తెలుగుతోపాటు మ‌ళ‌యాళ ప్రేక్ష‌కులు సైతం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

First Published:  7 Oct 2015 7:07 PM GMT
Next Story