Telugu Global
Cinema & Entertainment

లుంగి డ్యాన్స్ మెగాస్టార్ Vs చరణ్ 

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో లుంగి డ్యాన్స్ స్పెషలిష్ట్ అనడానికి సందేహమే లేదు. ఒక ఘరానా మొగుడు, ఒక ముఠా మేస్త్రి, ఒక బిగ్‌బాస్, ఒక అన్నయ్య, ఒక అంజి, ఒక చూడాలని ఉంది..ఇంకా చాలా ఉన్నాయి …మెగాస్టార్ లుంగి సాంగ్స్ కి స్టెప్పులేసిన పాటలు. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’… ‘ఏందిరో ఎట్టాగ ఉంది ఒల్లు ‘ వంటి సూపర్ హిట్ లుంగి సాంగ్స్ తో చిరు ఒక రేంజ్‌లో సంచలనం సృష్టించాడు. […]

లుంగి డ్యాన్స్ మెగాస్టార్ Vs చరణ్ 
X
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో లుంగి డ్యాన్స్ స్పెషలిష్ట్ అనడానికి సందేహమే లేదు. ఒక ఘరానా మొగుడు, ఒక ముఠా మేస్త్రి, ఒక బిగ్‌బాస్, ఒక అన్నయ్య, ఒక అంజి, ఒక చూడాలని ఉంది..ఇంకా చాలా ఉన్నాయి …మెగాస్టార్ లుంగి సాంగ్స్ కి స్టెప్పులేసిన పాటలు. ‘ఈ పేటకు నేనే మేస్త్రీ’… ‘ఏందిరో ఎట్టాగ ఉంది ఒల్లు ‘ వంటి సూపర్ హిట్ లుంగి సాంగ్స్ తో చిరు ఒక రేంజ్‌లో సంచలనం సృష్టించాడు. మొదటిసారి, రామ్ చరణ్ కూడా తన రాబోయే సినిమా ‘బ్రూస్ లీ ‘ లో లుంగి సాంగ్ చేస్తున్నాడు. ఈ సాంగ్ సినిమాలో టైటిల్ సాంగ్ మరియు లాస్ట్ సాంగ్ అని తెలుస్తోంది.
ఇటీవల, బాలివుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్, రామ్ చరణ్ మూవీ షూటింగ్ లొకేషన్‌కి వచ్చి చరణ్ డ్యాన్స్ రోజంతా చూసి.. అతని డ్యాన్సింగ్ స్కిల్ కి ఫిదా అయిపోయాడట. షారుఖ్‌తో చరణ్ ఉన్న స్టిల్స్‌లో, మెగాహీరో లుంగిలో కనిపిస్తూ కనువిందు చేస్తున్నాడు. మరి రామ్ చరణ్ తన లుంగి డ్యాన్స్‌తో తండ్రిని మరిపించగలడా? రామ్ చరణ్ కి ఇది మొదటి లుంగి డ్యాన్స్ సాంగ్. త్వరలో రాబోయే ‘బ్రూస్ లీ ‘ లో మెగాస్టార్ కూడా కనువిందు చేయబోతున్న సంగతి తెలిసిందే కదా!
First Published:  7 Oct 2015 7:04 PM GMT
Next Story