Telugu Global
Cinema & Entertainment

బంపర్ ఆఫర్ కొట్టేసిన నాని ?

భలే భలే మగాడివోయ్ సినిమాతో బంపర్ హిట్ కొట్టేసిన నాని, ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే లెజండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నాని నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి మణిరత్నంతో టచ్ లో ఉన్నాడు నాని. మంచి క్యారెక్టర్ దొరికితే, హీరో పాత్ర కాకపోయినా చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ మణిరత్నం మాత్రం నానికి ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. చివరికి ఓకే బంగారం […]

బంపర్ ఆఫర్ కొట్టేసిన నాని ?
X
భలే భలే మగాడివోయ్ సినిమాతో బంపర్ హిట్ కొట్టేసిన నాని, ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే లెజండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నాని నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దాదాపు మూడేళ్ల నుంచి మణిరత్నంతో టచ్ లో ఉన్నాడు నాని. మంచి క్యారెక్టర్ దొరికితే, హీరో పాత్ర కాకపోయినా చేస్తానని చెప్పుకొచ్చాడు. కానీ మణిరత్నం మాత్రం నానికి ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. చివరికి ఓకే బంగారం సినిమాలో కూడా మణిరత్నం కోసమే.. హీరో పాత్రకు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు నాని. ఇవన్నీ కలిసొచ్చి మణిరత్నం చూపు ఇప్పుడు నానిపై పడింది. మరీ ముఖ్యంగా భలే భలే మగాడివోయ్ సినిమాను చూసిన తర్వాత నానితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు మణిరత్నం. ప్రస్తుతం ఇద్దరి మధ్య కథాచర్చలు జరుగుతున్నాయి. మల్టీస్టారర్ మూవీగా ఇది రాబోతోందని సమాచారం.
First Published:  7 Oct 2015 7:07 PM GMT
Next Story