Telugu Global
Cinema & Entertainment

ఇరికించిన పాత్ర ఇర‌గదీస్తుందా?

గోన గ‌న్నారెడ్డి.. ఒక‌ప్ప‌టి కాక‌తీయ సామ్రాజ్యంలో రాబిన్ హుడ్‌లాంటి వీరుడు.  అక్టోబ‌రు 9న విడుద‌ల కానున్న రుద్ర‌మ‌దేవి పుణ్య‌మాని మ‌రోసారి ఈ దేశ‌భ‌క్తుడిని త‌ల‌చుకునే అవ‌కాశం క‌లిగింది. మూడేళ్ల క్రితం సినిమా ప్రారంభించిన‌పుడు లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్టే.. అయితే ఆర్థిక క‌ష్టాల్లో చిక్కుకున్న సినిమాను ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గ‌ట్టెక్కించ‌డంతో ఆయ‌న కుమారుడిని గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు సెలెక్ట్ చేశార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. గోన గ‌న్నారెడ్డిది చాలా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌! కాక‌తీయ సామ్రాజ్యం కోసం ప్రాణాలివ్వ‌డానికైనా.. […]

ఇరికించిన పాత్ర ఇర‌గదీస్తుందా?
X
గోన గ‌న్నారెడ్డి.. ఒక‌ప్ప‌టి కాక‌తీయ సామ్రాజ్యంలో రాబిన్ హుడ్‌లాంటి వీరుడు. అక్టోబ‌రు 9న విడుద‌ల కానున్న రుద్ర‌మ‌దేవి పుణ్య‌మాని మ‌రోసారి ఈ దేశ‌భ‌క్తుడిని త‌ల‌చుకునే అవ‌కాశం క‌లిగింది. మూడేళ్ల క్రితం సినిమా ప్రారంభించిన‌పుడు లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్టే.. అయితే ఆర్థిక క‌ష్టాల్లో చిక్కుకున్న సినిమాను ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ గ‌ట్టెక్కించ‌డంతో ఆయ‌న కుమారుడిని గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు సెలెక్ట్ చేశార‌ని ఫిలింన‌గ‌ర్ టాక్‌. గోన గ‌న్నారెడ్డిది చాలా ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌! కాక‌తీయ సామ్రాజ్యం కోసం ప్రాణాలివ్వ‌డానికైనా.. తీయ‌న‌డానికైనా వెర‌వ‌ని వీరుడు. అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ పాత్రను ఫుల్‌గా ఎలివేట్ చేస్తే.. రుద్ర‌మ‌దేవి పాత్ర చిన్న‌బోతుంది. అందుకే ఈ పాత్ర మెరుపులా వ‌చ్చి పోతుంటుంది. కానీ, ప్ర‌స్తుతం పాత్ర వేసింది అర్జున్ కావ‌డంతో డైలాగులు మార్చి, పాత్ర నిడివి పెంచార‌ని స‌మాచారం. దీంతో ఈ పాత్ర రుద్ర‌మ‌దేవి పాత్ర‌ను డామినేట్ చేస్తుందా? అన్న చ‌ర్చ న‌డుస్తోంది. మెరుపులాంటి పాత్ర‌ను ఫుల్ లెంగ్త్ చేయ‌డం సినిమాకు క‌మర్షియ‌ల్‌గా క‌లిసి వ‌చ్చే అంశ‌మే! కానీ, రుద్ర‌మ‌దేవిని డామినేట్ చేస్తే.. సినిమా విజ‌యం సాధించినా.. ద‌ర్శ‌కుడు అనుకున్న ల‌క్ష్యం చేర‌న‌ట్లే! మ‌రి ఇరికించిన పాత్ర‌లో అల్లు అర్జున్ ఎంత‌మేర‌కు ఇర‌గ‌దీస్తాడోన‌ని ప్రేక్ష‌కులు ఎదురుచూస్తున్నారు.
ఎవ‌రు ఈ గోన గ‌న్నారెడ్డి ?
కాకతీయ సామ్రాజ్యానికున్న అనేకానేక సామంతులలో బుద్ధపురం మహారాజు గోన బుద్ధారెడ్డి ఒకడు. అత‌ని కుమారుడే గోన గ‌న్నారెడ్డి. పినతండ్రి చేసిన ద్రోహానికి అత‌నికి రాజ్యం ద‌క్కుకుండా పోతుంది. బాల్యం నుంచే ప‌రాక్ర‌మ‌వంతుడైన గోన గ‌న్నారెడ్డికి కాక‌తీయ సామ్రాజ్యం అంటే..ప్రాణం. అందుకే రాజ్యంలో బందిపోటులా సంచ‌రిస్తూ.. దేశ‌ద్రోహుల‌ను క‌నిపెట్టి మ‌ట్టుబెడుతుండేవాడు. దీనికి రుద్ర‌మ‌దేవి అనుమ‌తి ఉండేది. అందుకే ఎవ‌రికీ తెలియ‌కుండా న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో ఓ పాడుబ‌డిన దుర్గంలో త‌ల‌దాచుకునేవాడు. ఇత‌ని వెంట అనుచ‌రులు కూడా భారీగా ఉండేవారు. రాజ్యంలో ఎప్పుడు, ఎక్క‌డ జ‌రుగుతుందో తెలుసుకునే నెట్‌వ‌ర్క్ ఇత‌నికి ఉండేద‌ని చ‌రిత్ర చెబుతోంది. మ‌రి అంత‌టి ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌ను చిత్రంలో ఎలా చూపించారో! వేచి చూడాలి!
First Published:  6 Oct 2015 7:05 PM GMT
Next Story