Telugu Global
Cinema & Entertainment

సల్మాన్ ను నిలువునా దోచేసిన భామలు

ఫ్యాన్స్ అంటే సల్మాన్ కు ఎప్పుడూ ఇష్టమే. వాళ్ల కోసం సెల్ఫీలకు ఫోజులిస్తుంటాడు. ఎప్పుడు అడిగినా ఆటోగ్రాఫ్ కాదనడు. తను ఏ పనిలో ఉన్నప్పటికీ ఫ్యాన్ అని చెబితే కాస్త టైం కేటాయించడానికి వెనకాడడు. అలాంటి సల్మాన్ ను ఫ్యాన్స్ అనే ముసుగులో నలుగురు భామలు నిలువునా దోచేశారు. ముంబయిలోని ఓ నైట్ క్లబ్ లో ఈ ఘటన జరిగింది. ఓ నైట్ క్లబ్ లో జరిగిన పార్టీకి ప్రత్యేక అతిథిగా వెళ్లాడు సల్మాన్ ఖాన్. అక్కడున్న […]

సల్మాన్ ను నిలువునా దోచేసిన భామలు
X
ఫ్యాన్స్ అంటే సల్మాన్ కు ఎప్పుడూ ఇష్టమే. వాళ్ల కోసం సెల్ఫీలకు ఫోజులిస్తుంటాడు. ఎప్పుడు అడిగినా ఆటోగ్రాఫ్ కాదనడు. తను ఏ పనిలో ఉన్నప్పటికీ ఫ్యాన్ అని చెబితే కాస్త టైం కేటాయించడానికి వెనకాడడు. అలాంటి సల్మాన్ ను ఫ్యాన్స్ అనే ముసుగులో నలుగురు భామలు నిలువునా దోచేశారు. ముంబయిలోని ఓ నైట్ క్లబ్ లో ఈ ఘటన జరిగింది. ఓ నైట్ క్లబ్ లో జరిగిన పార్టీకి ప్రత్యేక అతిథిగా వెళ్లాడు సల్మాన్ ఖాన్. అక్కడున్న నలుగురు ముద్దుగుమ్మలు సల్మాన్ దగ్గరకొచ్చి పరిచయం చేసుకున్నారు. ఫ్యాన్స్ అని చెప్పుకున్నారు. అభిమానులు అని చెప్పడంతో వాళ్లతో ఫొటో దిగడానికి సల్మాన్ రెడీ అయ్యాడు. తన పర్స్, పెండెంట్, అద్దాలు టేబుల్ పై పెట్టి లేచి నిల్చుకున్నాడు. అమ్మాయిలతో సెల్ఫీ దిగాడు.. వాళ్ల కు టాటా చెప్పి పంపించేశాడు. కట్ చేసి చూస్తే.. టేబుల్ పై వస్తువులు లేవు. దీనిపై ఎలాంటి పోలీస్ కంప్లయింట్ ఇవ్వదలుచుకోలేదు సల్మాన్. కేవలం తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మాత్ర చీవాట్లు పెట్టాడు.
First Published:  6 Oct 2015 7:06 PM GMT
Next Story