Telugu Global
Cinema & Entertainment

గంటా కొడుక్కి హ్యాండ్ ఇచ్చిన పూరి

లోఫర్ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ చేయబోయే సినిమాపై అందర్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఓ కొత్త కుర్రాడిని తన నెక్ట్స్ సినిమాతో పరిచయం చేయబోతున్నానంటూ పూరి ప్రకటించాడు. ఆ వెంటనే అంతా మంత్రి గంటా శ్రీనివాసరావు వైపు చూశారు. ఎందుకంటే.. గంటా తన కొడుకును హీరోగా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఆమధ్య పూరి జగన్నాధ్ తో గంటా చర్చలు జరిపారనే టాక్ వినిపించింది. దీనికి తోడు […]

గంటా కొడుక్కి హ్యాండ్ ఇచ్చిన పూరి
X
లోఫర్ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ చేయబోయే సినిమాపై అందర్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. ఓ కొత్త కుర్రాడిని తన నెక్ట్స్ సినిమాతో పరిచయం చేయబోతున్నానంటూ పూరి ప్రకటించాడు. ఆ వెంటనే అంతా మంత్రి గంటా శ్రీనివాసరావు వైపు చూశారు. ఎందుకంటే.. గంటా తన కొడుకును హీరోగా చేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఆమధ్య పూరి జగన్నాధ్ తో గంటా చర్చలు జరిపారనే టాక్ వినిపించింది. దీనికి తోడు పూరి ప్రకటన కూడా చేయడంతో.. గంటా తనయుడ్ని పూరి హీరోగా పరిచయం చేయబోతున్నాడని అంతా అనుకున్నారు. కానీ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఇషాన్ అనే ఓ కొత్త కుర్రాడి ఫొటోను పోస్ట్ చేశాడు పూరి. ఇతడే తన నెక్ట్స్ సినిమా హీరో అని, వచ్చేనెల నుంచి షూటింగ్ ప్రారంభమౌతుందని ప్రకటించాడు. దీంతో ఇషాన్ ఎవరా అని అంతా ఆరా తీశారు. శ్రీకాంత్ తో మహాత్మా సినిమా నిర్మించిన సీఆర్ మనోహర్ కొడుకే ఈ ఇషాంత్. తెలుగుతో పాటు కన్నడలో కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఇలా పూరిని ఆశ్రయించాడు.
First Published:  6 Oct 2015 7:07 PM GMT
Next Story