Telugu Global
Cinema & Entertainment

ప్రేమికుల రోజు కానుకగా త్రివిక్రమ్ మూవీ

నితిన్ ను హీరోగా పెట్టి త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేశారు. వాలంటైన్స్ డే కానుకగా నితిన్-త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేయాలని ప్రాధమికంగా టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకు అ..ఆ..అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ఈ టైటిల్ అర్థం. సినిమాలో నితిన్ సరసన జతగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపికచేశారు. మరో […]

ప్రేమికుల రోజు కానుకగా త్రివిక్రమ్ మూవీ
X
నితిన్ ను హీరోగా పెట్టి త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ చేశారు. వాలంటైన్స్ డే కానుకగా నితిన్-త్రివిక్రమ్ సినిమాను రిలీజ్ చేయాలని ప్రాధమికంగా టార్గెట్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకు అ..ఆ..అనే డిఫరెంట్ టైటిల్ పెట్టారు. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనేది ఈ టైటిల్ అర్థం. సినిమాలో నితిన్ సరసన జతగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపికచేశారు. మరో కీలకపాత్రకు అవసరాల శ్రీనివాస్ ను ఎంపికచేశారు. ఇక త్రివిక్రమ్ సినిమాలతో పాపులర్ అయిన నదియ.. ఈ సినిమాలో కూడా ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. త్రివిక్రమ్ సినిమాలకు రెగ్యులర్ గా సంగీతం అందించే దేవిశ్రీమాత్రం ఈ ప్రాజెక్ట్ కు దూరంగా ఉన్నాడు. తమిళ కుర్రసంగీత దర్శకుడు అనిరుథ్ ను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకున్నారు. ఇలా అంతా క్రేజీ కాంబినేషన్ తో వస్తున్న అ..ఆ.. సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.
First Published:  5 Oct 2015 7:06 PM GMT
Next Story