Telugu Global
Cinema & Entertainment

రవితేజ సినిమాకు టైటిల్ మారింది..

ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్ అనే సినిమా చేస్తున్నాడు. నవంబర్ 5న ఈ సినిమా అట్టహాసంగా విడుదలకాబోతోంది. అయితే ఈ సినిమాతో పాటు రవితేజ చేయబోయే నెక్ట్స్ సినిమాపై కూడా చర్చ సాగుతోంది. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో మాస్ రాజా ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు అందర్లో ఒక్కడు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇదే టైటిల్ ను దిల్ రాజు తన బ్యానర్ పై ఫిలించాంబర్ లో […]

రవితేజ సినిమాకు టైటిల్ మారింది..
X
ప్రస్తుతం రవితేజ బెంగాల్ టైగర్ అనే సినిమా చేస్తున్నాడు. నవంబర్ 5న ఈ సినిమా అట్టహాసంగా విడుదలకాబోతోంది. అయితే ఈ సినిమాతో పాటు రవితేజ చేయబోయే నెక్ట్స్ సినిమాపై కూడా చర్చ సాగుతోంది. త్వరలోనే దిల్ రాజు బ్యానర్ లో మాస్ రాజా ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు అందర్లో ఒక్కడు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. ఇదే టైటిల్ ను దిల్ రాజు తన బ్యానర్ పై ఫిలించాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందర్లో ఒక్కడు అనే మాస్ టైటిల్ కాకుండా.. భోగి అనే డిఫరెంట్ టైటిల్ ను సినిమాకు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ఆనందంగా ఉండేవాడు అనే క్యాప్షన్ ను కూడా పెట్టినట్టు సమాచారం. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ మూవీ. టైటిల్ చూస్తుంటే.. సినిమా కాస్త విభిన్నంగానే ఉన్నట్టు కనిపిస్తోంది.
Next Story