Telugu Global
Cinema & Entertainment

భ‌ల్లాల దేవ‌తో రొమాన్స్‌కు దేవ‌సేన రెడీ!

భ‌ల్లాల దేవుడితో దేవ‌సేన రొమాన్స్ ఏంటని కంగారు ప‌డ‌కండి..! ఈ నెల 9న రుద్ర‌మ‌దేవి సినిమా విడుద‌ల కానుంది. కాక‌తీయుల చ‌రిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అనుష్క‌, రాణా జంట‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లై ప్రపంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాల దేవుడిగా రాణా, దేవ‌సేన‌గా అనుష్క బ‌ద్ద‌శ‌త్రువులుగా న‌టించిన విష‌యం తెలిసిందే! ఆ క‌థ‌లో త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌న్న క‌క్ష‌తో దేవ‌సేన‌ను పాతికేళ్లుగా బంధీగా ఉంచుతాడు భ‌ల్లాల‌దేవుడు. ఈ చిత్రం ఇప్ప‌టికీ […]

భ‌ల్లాల దేవ‌తో రొమాన్స్‌కు దేవ‌సేన రెడీ!
X

భ‌ల్లాల దేవుడితో దేవ‌సేన రొమాన్స్ ఏంటని కంగారు ప‌డ‌కండి..! ఈ నెల 9న రుద్ర‌మ‌దేవి సినిమా విడుద‌ల కానుంది. కాక‌తీయుల చ‌రిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో అనుష్క‌, రాణా జంట‌గా న‌టిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లై ప్రపంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ బాహుబ‌లి సినిమాలో భ‌ల్లాల దేవుడిగా రాణా, దేవ‌సేన‌గా అనుష్క బ‌ద్ద‌శ‌త్రువులుగా న‌టించిన విష‌యం తెలిసిందే! ఆ క‌థ‌లో త‌న ప్రేమ‌ను అంగీక‌రించ‌లేద‌న్న క‌క్ష‌తో దేవ‌సేన‌ను పాతికేళ్లుగా బంధీగా ఉంచుతాడు భ‌ల్లాల‌దేవుడు. ఈ చిత్రం ఇప్ప‌టికీ ఆడుతూనే ఉంది. ఇప్పుడు దాదాపు అదే వేష‌ధార‌ణ‌లో మ‌రో చారిత్ర‌క సినిమాలో ఈ ఇద్ద‌రు జోడీగా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో రాణి రుద్ర‌మ దేవి భ‌ర్త అయిన వీర‌భ‌ద్రుడి పాత్ర ను రాణా పోషించాడు! గ‌త చిత్రంలో క‌త్తులు దూసుకున్న వీరి మ‌ధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాల‌ని ప్రేక్ష‌కులు ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. అద‌న్న మాట అస‌లు విష‌యం!

First Published:  5 Oct 2015 7:04 PM GMT
Next Story