Telugu Global
Cinema & Entertainment

అనుష్క, బన్నీ మాట‌లు మంట పెడుతున్నాయా...?

ప‌లు అవాంత‌రాల‌ను దాటి ఎట్ట‌కేల‌కు ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది రుద్ర‌మ‌దేవి. సినిమా విడుద‌ల‌య్యాక హిట్/ ప‌్లాప్ సంగ‌తి ఎలా ఉన్నా.. సినిమాలో కొన్ని డైలాగులు  ప్రాంతీయ‌ప‌రంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని పలువరంటున్నారు. సినిమా పూర్తిగా తెలంగాణ‌కు సంబంధించిందే! అయినా.. అనుష్క‌, అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగులు పై ఇప్ప‌టికే ప‌లువురు తెలంగాణ‌వాదులు కారాలు, మిరియాలు నూరుతున్నారు.  ‘ఒక త‌ల్లి పాలు తాగిన వాళ్లంద‌రూ అన్న‌ద‌మ్ములైతే.. ఒకే న‌ది నీళ్లు […]

అనుష్క, బన్నీ మాట‌లు మంట పెడుతున్నాయా...?
X
ప‌లు అవాంత‌రాల‌ను దాటి ఎట్ట‌కేల‌కు ఈ నెల 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది రుద్ర‌మ‌దేవి. సినిమా విడుద‌ల‌య్యాక హిట్/ ప‌్లాప్ సంగ‌తి ఎలా ఉన్నా.. సినిమాలో కొన్ని డైలాగులు ప్రాంతీయ‌ప‌రంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని పలువరంటున్నారు. సినిమా పూర్తిగా తెలంగాణ‌కు సంబంధించిందే! అయినా.. అనుష్క‌, అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగులు పై ఇప్ప‌టికే ప‌లువురు తెలంగాణ‌వాదులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ‘ఒక త‌ల్లి పాలు తాగిన వాళ్లంద‌రూ అన్న‌ద‌మ్ములైతే.. ఒకే న‌ది నీళ్లు తాగిన వాళ్లు..అన్న‌ద‌మ్ముల్లా ఉండ‌లేరా’? అని అనుష్క హిత‌బోధ చెసినట్టు వారంటున్నారు. మ‌రోవైపు అల్లు అర్జున్ ‘నేను తెలుగు భాష లెక్క‌. ఆడా ఉంటా.. ఈడా ఉంటా’..! అంటూ చెప్పే డైలాగుల‌పై ప‌లువురు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇవి తెలంగాణ‌పై ఆధిప‌త్యం ధోర‌ణిని తెలియ‌జేస్తున్నాయ‌ని, క‌థ తెలంగాణ‌కు సంబంధించిన‌ది అయిన‌పుడు వివాదాస్ప‌ద డైలాగులు ఎందుకని వారు మండిప‌డుతున్నారు.

గ‌తంలోనూ ‘నిప్పు’ రాజేశాడు..!
ఈ స‌న్నివేశాలు క‌థ‌లో భాగంగాగానే వ‌చ్చాయ‌ని ద‌ర్శ‌కుడు చెప్పే ప్ర‌య‌త్నం చేసినా.. ప్రేక్ష‌కులు న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే.. తెలంగాణ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న స‌మ‌యంలో గుణ‌శేఖ‌ర్ చిత్రం ‘నిప్పు’ సినిమా రిలీజైంది. అదే స‌మ‌యంలో తెలంగాణ నుంచి హైద‌రాబాద్ ను వేరు చేయాల‌ని కొంద‌రు డిమాండ్లు వినిపించారు. దీనిని స‌మ‌ర్థించేలా..నిప్పు సినిమాలో తెలంగాణకు హైద‌రాబాద్ తో సంబంధం లేద‌న్న‌ట్లుగా హీరోతో ఓ వివాదాస్ప‌ద డైలాగ్‌ చెప్పించాడు గుణ‌శేఖ‌ర్‌. ఆ సంభాష‌ణ‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సినిమా డిజాస్ట‌ర్ కావ‌డంతో దీనిపై తెలంగాణ‌వాదులు పెద్ద‌గా దృష్టి పెట్ట‌ లేదు.

ఇప్పుడు అవ‌స‌ర‌మా!
అస‌లే వ‌రుస ప్లాపుల మీద ఉన్న గుణ‌శేఖ‌ర్ ప్రాంతీయ విభేదాలు గుర్తు చేసేలా ప్రేక్ష‌కుల‌కు నీతులు చెప్పాల్సిన అవ‌స‌ర‌మేం ఉంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు ప్ర‌జ‌లు. ఇటీవ‌ల రిలీజైన బాహుబ‌లి సినిమా బాక్సాఫీసు వ‌ద్ద వంద‌ల కోట్ల రూపాయ‌లు రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే! గుణ‌శేఖ‌ర్ కంటే రాజ‌మౌళి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్! ఆయ‌న ఇలాంటి డైలాగులు పెట్ట‌లేదే..! మ‌రి ఎవ‌రికీ ప‌ట్ట‌ని ప్రాంతీయ డైలాగులు ఈయ‌న‌కు మాత్రం ఎందుకు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఒక వేళ రాష్ట్రం ఉమ్మ‌డిగా ఉన్న‌పుడు సినిమా విడుద‌లైనా స‌మ‌ర్థించుకోవ‌చ్చు గానీ, ఇప్పుడు అన‌వ‌స‌రంగా ఈ చ‌ర్చ పెట్టి గుణ‌శేఖ‌ర్ కొరివితో త‌ల గోక్కునేలా ఉన్నాడని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story